instinct
-
ఛార్జింగ్ అవసరం లేని స్మార్ట్‌వాచ్.. ఇంకెలా పనిచేస్తుందంటే?
ఈ ఫొటోలో చేతికి తొడుక్కున్న వాచీ చూస్తున్నారు కదా! ఇది స్మార్ట్ వాచీ. మిగిలిన స్మార్ట్ వాచీల మాదిరిగా దీని బ్యాటరీకి చార్జింగ్ అవసరం లేదు. ఇది పూర్తిగా సోలార్ స్మార్ట్ వాచ్. ఎండలో కాసేపు తిరిగితే చాలు, ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ ఇటీవల ఈ పూర్తిస్థాయి సోలార్ స్మార్ట్ వాచ్‌ను ‘ఇన్స్టింక్ట్–2’ పేరుతో విడుదల చేసింది. దీనికి అమర్చిన లెన్స్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. రోజుకు మూడుగంటల సేపు ఎండసోకితే, ఈ వాచ్ ఇరవైనాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎండసోకని పరిస్థితులు రోజుల తరబడి ఉంటే, యూఎస్బీ చార్జర్ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఫ్లాష్‌లైట్ కూడా ఉండటం విశేషం. ఆరుబయట పిక్నిక్లు, ట్రెక్కింగ్‌లకు వెళ్లే వారికి ఈ వాచ్ పూర్తి అనుకూలంగా ఉంటుందని ‘గ్రామిన్ ఇంటర్నేషనల్’ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ చెబుతున్నారు. దీని మోడల్స్‌లో వైవిధ్యాన్ని బట్టి దీని ధర 389.99 డాలర్ల (రూ.32,027) నుంచి 469.99 డాలర్ల (38,597) వరకు ఉంది. -
నాస్తికులు అందరూ తెలివైన వాళ్లా?
ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్ దగ్గర నుంచి అలన్ ట్యూరింగ్ వరకూ.. ఇలా ప్రపంచంలో చాలా మంది తెలివైన వ్యక్తులందరూ నాస్తికులు. వీరందరూ ఎందుకు నాస్తికులు అయ్యారు?. నాస్తికుడు అయిన ప్రతి వ్యక్తి వీరంత గొప్పగా అవుతారా? లేదా తెలివైన ప్రతి ఒక్కరూ నాస్తికులుగా మారతారా? అనే ప్రశ్నలకు ఉల్స్టర్ ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్, రొట్టర్డమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. ఈ విషయాలపై అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. మతాన్ని అభిమానించడం లేదా అభిమానించకపోవడం అనేది వ్యక్తి సహజ లక్షణాలపై ఆధారపడివుంటుందని చెప్పారు. తెలివితేటలతో సహజ లక్షణాలను నిలువరింపజేయగల శక్తి వస్తుందని వివరించారు. దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధన కోసం ఇంటిలిజెన్స్-మిస్‌మ్యాచ్ అసోసియేషన్ అనే మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ మోడల్ ద్వారా మతపరమైన సంబంధాలపై తెలివితేటలు గల వ్యక్తులు అనాసక్తిని ఎందుకు ప్రదర్శిస్తారనే విషయాన్ని వివరించేందుకు ప్రయత్నించారు. వ్యక్తి లక్షణాలు, ఒత్తిడిపై కూడా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తెలివైన వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరు ఏ పనినైనా ఇట్టే క్షణాల్లో పూర్తి చేయగలరని వివరించారు.