నొప్పి లేకుండా చక్కెర స్థాయి చెబుతుంది..! | Sakshi
Sakshi News home page

నొప్పి లేకుండా చక్కెర స్థాయి చెబుతుంది..!

Published Sun, Feb 18 2024 8:00 AM

Samsung has made a watch that tells the level of diabetes without pain - Sakshi

డయాబెటిస్‌ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్‌ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు.

ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్‌ కంపెనీ ‘సామ్‌సంగ్‌’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్‌ మీద చూపిస్తుంది. ‘సామ్‌సంగ్‌’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్‌ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే!

Advertisement
 
Advertisement
 
Advertisement