Samsung company
-
నొప్పి లేకుండా చక్కెర స్థాయి చెబుతుంది..!
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘సామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘సామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
ప్రవక్త వివాదం: శాంసంగ్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. ఇస్లాంను, మొహమ్మద్ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు పాకిస్థాన్‌కు క్షమాపణలు తెలియజేసింది శాంసంగ్. బ్లాస్ఫెమీ(దైవదూషణ)కి పాల్పడడంతో శాంసంగ్ కంపెనీపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు కొరియన్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మతపరమైన భావాలపై తటస్థతను కొనసాగిస్తుందని ట్విటర్లో ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. శుక్రవారం కరాచీలోని స్టార్ సిటీ మాల్లో ఇన్స్టాల్ చేసిన ఓ వైఫై డివైజ్ మూలంగా ఈ రచ్చ షురూ అయ్యింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. మాల్ దగ్గరికి చేరుకుని కొందరు నిరసనలకు దిగారు. అదే సమయంలో శాంసంగ్ తీసుకొచ్చిన ఓ క్యూఆర్ కోడ్ ప్రవక్తను కించపరిచేదిగా ఉందంటూ గొడవ మరింత ముదిరింది. శాంసంగ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. రెచ్చిపోయి మాల్ బయట విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa — Naila Inayat (@nailainayat) July 1, 2022 Samsung Pakistan - Press Release July 1st, 2022. pic.twitter.com/IVSpAkH8Lm — Samsung Pakistan (@SamsungPakistan) July 1, 2022 విషయం తెలిసి మాల్‌కు చేరుకున్న పోలీసులు.. 27 మంది శాంసంగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తెహ్రీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూప్ సభ్యులని నిర్ధారించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ మాత్రం చేయలేదు. పాక్‌లో దైవదూషణను అక్కడి చట్టం తీవ్ర నేరంగా భావిస్తుంది. కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా.. ఒక్కోసారి మరణ శిక్ష కూడా అమలు చేస్తారు. కిందటి ఏడాది డిసెంబర్లో ఇస్లాంను కించపరిచిన నేరానికి.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి సియాల్కోట్లో మూక హత్యకు గురయ్యాడు. చదవండి: నూపుర్‌శర్మ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే! -
హార్డ్‌డిస్క్‌లకు కాలం చెల్లినట్లేనా?
కంప్యూటర్లు, ల్యాప్టాపలలో బోలెడంత బరువుండే హార్డ్ డిస్క్‌లకు ఇక కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటారా? శ్యాంసంగ్ కంపెనీ ఏకంగా నాలుగు టెరాబైట్ల సమాచారాన్ని ఇముడ్చుకోగల మెమరీ కార్డును ఆవిష్కరించింది మరీ! అంతేకాదు.. ఈ మెమరీ డివైజ్‌లోకి ఏదైనా ఫైల్‌ను నిక్షిప్తం చేయడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. సెకనుకు 540 మెగాబిట్ల వేగంతో ఫైళ్లను చదవడం.. 520 మెగాబిట్ల వేగంతో రాయడం చేస్తుంది ఈ మెమరీ కార్డు. ఇంకోలా చెప్పాలంటే ఒకే రెండు సెకన్లలో ఓ మోస్తరు హెచ్డీ సినిమా మొత్తాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక్కో మెమరీ సెల్లో తాము మూడు స్థానంలో నాలుగు బిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలిగామని ఇందుకోసం మూడు బిట్ల ఎస్ఎస్డీ కంట్రోలర్, టర్బోరైట్ టెక్నాలజీలను వాడామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ మెమరీ కార్డులో 64 పొరలున్న వీ–ఎన్ఏఎన్డీ మైక్రోప్రాసెసర్లు 32 వాడామని ఫలితంగా ఇతర నాలుగు టెరాబైట్ల సామర్థ్యం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలదని చెప్పారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 2.5 అంగుళాల సైజు డ్రైవ్‌లకు కొత్త 4 టెరాబైట్ల మెమరీకార్డు తోడవనుందని.. ఇదే టెక్నాలజీతో తాము స్మార్ట్ఫోన్లలోనూ మెమరీ సామర్థ్యాన్ని పెంచగలమని శాంసంగ్ చెబుతోంది! -
శాంసంగ్ నుంచి సరికొత్త టీవీ
సాక్షి : కళ్లకు కట్టినట్టు కనిపించే దృశ్యాలను చూస్తూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. అలాంటి అనుభూతిని కలిగించేందుకు శాంసంగ్ సరికొత్త టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. బ్రిక్స్‌బీ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లు, ఎత్తుగడతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నోటి మాట ద్వారా మనకు నచ్చిన సినిమాలను, పాటలను (టీవీలో అంతర్గతంగా ఉండే బ్రిక్స్‌బీ పరికరం సహాయంతో) ప్లే చేయించవచ్చు. ఈ అధునాతన టీవీలు త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. శాంసంగ్ స్మార్ట్ వ్యూ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీలో వీక్షించవచ్చు. అదనంగా సరికొత్త ఫీచర్‌తో క్యూఎల్ఈడీ టీవీలు మే నెల చివరికల్లా భారతీయ వినియోగదారులను పలకరించబోతున్నాయి. త్వరలోనే వీటి ధరలను ప్రకటించనున్నట్లు సామ్సాంగ్ అధికారులు తెలిపారు. 4కె రిజల్యూషన్‌తో క్యూఎల్ఈడీ టీవీలను ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి లాంచ్ చేయనున్నామన్నారు. 85 ఇంచుల తెర, 8కె కృత్రిమ మేధస్సులాంటి ఫీచర్స్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు. కాగా 2017లో శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీలు ఇండియాలో లాంచ్ చేసింది. ఒక్క నెలలోనే విశేషమైన స్పందన వచ్చింది. డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు తాజాగా మరింత వేగంగా దూసుకొస్తోంది. -
శాంసంగ్ నోట్ 7.. ఆగిపోతుందా?
కొత్త బ్యాటరీలతో మార్చి ఇచ్చిన తర్వాత కూడా ఫోన్లు పేలిపోతుండటంతో తాము ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల ఉత్పత్తిని శాంసంగ్ కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసిందని తెలుస్తోంది. చాలా ఫోన్లను రీకాల్ చేసి, వాటి బదులు కొత్త ఫోన్లు ఇచ్చినా, బ్యాటరీలో సమస్యను పరిష్కరించినట్లు చెప్పినా.. ఇప్పటికీ మళ్లీ మళ్లీ ఫోన్లలోంచి మంటలు వస్తుండటంతో తాత్కాలికంగా వీటి ఉత్పత్తిని ఆపేయాలని శాంసంగ్ నిర్ణయించిందని 'యోన్హాప్' అనే మీడియా సంస్థ తెలిపింది. తమ విమానాల్లో ఈ ఫోన్లను తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అమెరికాకు చెందిన రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తెలిపాయి. అయితే, ఉత్పత్తి నిలిపివేతపై శాంసంగ్ మాత్రం అధికారికంగా ఇంకా స్పందించలేదు. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా తమ శాంసంగ్ ఫోన్లో సమస్యలు ఉన్నాయని, దాన్ని మార్పించుకున్నాను కాబట్టి కొంతవరకు పర్వాలేదని భావిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. అమెరికాలో మొబైల్ ఫోన్ల వ్యాపారంలో రెండో స్థానంలో ఉన్న ఏటీఅండ్ టీ సంస్థ, మూడో స్థానంలో ఉన్న టి-మొబైల్ కూడా తాము శాంసంగ్ నోట్ 7 ఫోన్లను ఎక్స్చేంజి చేయడం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా సహా పది దేశాల్లోని దాదాపు 25 లక్షల నోట్ 7 ఫోన్లను రీకాల్ చేస్తున్నట్లు శాంసంగ్ కంపెనీ సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటించింది. బ్యాటరీలలో సమస్య కారణంగా ఆ ఫోన్లలోంచి మంటలు వస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవలే అమెరికాలోని ఒక విమానంలో మార్చిన నోట్ 7 ఫోన్లోంచి కూడా మంటలు రావడంతో.. అప్పటికప్పుడు విమానం నుంచి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. -
భారత్ మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 5
ఈ నెల 20 నుంచి విక్రయాలు - ధరలు రూ.53,990 (32 జీబీ) రూ.59,900 (64 జీబీ) న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేటగిరిలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. గెలాక్సీ నోట్ 5 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధరలు రూ.53,990థ (32జీబీ), రూ.59,900 (64జీబీ)గా నిర్ణయించామని శామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్(ఐటీ అండ్ మొబైల్) ఆశిమ్ వర్శి చెప్పారు. ఈ నెల 20 నుంచి వీటి విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ సూపర్ అమెలెడ్ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. గత నెలలో ఈ ఫోన్‌ను అమెరికాలో అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.30,000 ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది అన్ని రకాల(ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు) డివైస్ల విక్రయాల్లో మంచి వృద్ధిని సాధించామని వివరించారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ల మార్కెట్లలో భారత్ ఒకటని, 2017లో రెండో అతి పెద్ద మార్కెట్‌గా అమెరికాను తోసిరాజని ఆ స్థానంలోకి భారత్ దూసుకెళుతుందని పేర్కొన్నారు. -
ఇక ప్రత్యేక ‘సెల్ పాలసీ’!
* మొబైల్ ఫోన్ల తయారీకి ప్రత్యేక పార్కు * పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విధానాలు * విధి విధానాలపై పరిశ్రమల విభాగం కసరత్తు సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ తయారీ పరిశ్రమ రాష్ట్రంలో వేళ్లూనుకునేలా ప్రత్యేక ‘సెల్ పాలసీ’ని రూపొందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ అధికారులు నూతన విధానంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ తరహాలో ‘సెల్ పాలసీ’ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. త్వరలో సీఎంకు నూతన పాలసీ విధి విధానాలు సమర్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. చైనా ఆధారితంగా ఉన్న మొబైల్ ఫోన్ల పరిశ్రమ దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం భూమితో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఈ రంగంలో సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ హబ్ ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని మంచిరేవుల, రావిర్యాల అనుకూలంగా ఉంటాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దీంతో మొబైల్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించడంపై టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ మైక్రోమాక్స్, సెల్కాన్, కార్బన్ తదితర సెల్ కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అంతర్జాతీయ స్థాయి కలిగిన మైక్రోమాక్స్ తొలి దశలో రూ.80 కోట్ల పెట్టుబడులతో ముందుకు రాగా ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. ప్రతిష్టాత్మక శామ్సంగ్ కంపెనీ పెట్టుబడుల కోసం సర్కారు ప్రయత్నిస్తోంది. ఇండియా సెల్యులార్ సంఘం సభ్యులు కొందరు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. అయితే పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొబైల్ పరిశ్రమల పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ప్రత్యేక విధానం రూపొందించి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పోటీ తట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ‘సెల్ పాలసీ’కే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్ తదితర రంగాలకూ ప్రత్యేక విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. -
40 శాతం తగ్గిన శామ్సంగ్ లాభం
సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ నికర లాభం ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 40 శాతం తగ్గింది. వినియోగదారులు పెద్ద సైజు యాపిల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, చైనా కంపెనీల నుంచి పోటీ అంతకంతకూ పెరిగిపోవడం, దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం దీనికి ప్రధాన కారణాలు. దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం వల్ల విదేశీ మార్కెట్లలో శామ్సంగ్ ఉత్పత్తులు ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో కంపెనీ నికర అదాయం 420 కోట్ల డాలర్లకు తగ్గింది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో యాపిల్, చైనా కంపెనీల పోటీ కారణంగా శామ్సంగ్ కంపెనీ లాభదాయకత తగ్గిపోయింది. కాగా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఎస్6 స్మార్ట్ఫోన్లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి. -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్6 ఇదిగో...
- ఐఫోన్6కు పోటీ - వచ్చే నెల 10 నుంచి విక్రయాలు బార్సిలోనా: యాపిల్ ఐఫోన్ 6కు పోటీగా శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లను తెస్తోంది. ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015లో వీటిని ప్రదర్శించింది. ‘యాపిల్ పే’కు పోటీగా ‘శామ్సంగ్ పే’ మొబైల్ పేమెంట్‌ను కూడా శామ్సంగ్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ల విక్రయాలు వచ్చే నెల 10 నుంచి ప్రారంభం అవుతాయి. 32, 64, 128 జీబీ స్టోరేజ్‌ల్లో ఈ ఫోన్లను అందిస్తున్నామని కంపెనీ సీఈఓ జె.కె. షిన్ చెప్పారు. ఈ ఫోన్లలో 5.1 అంగుళాల క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 64-బిట్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన 14 నానో మీటర్ మొబైల్ ప్రాసెసర్(ఇది ప్రపంచంలోనే అత్యంతాధునిక మెమరీ టెక్నాలజీ), 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెర్లైస్ చార్జింగ్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. 10 నిమిషాలు చార్జింగ్ చేస్తే 4 గంటలు ఉపయోగించుకోవచ్చని వివరించారు. గెలాక్సీ 6 ఎడ్జ్‌లో రెండు వైపులా కర్వ్డ్ స్క్రీన్స్ ఉంటాయని... ఒకే లేయర్ డిస్ప్లేపై 3 విభిన్నమైన స్క్రీన్లు పనిచేస్తాయని తెలిపారు. -
భారత్‌లోకి శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4..
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ నోట్ 4 ఫ్యాబ్లెట్‌ను భారత మార్కెట్లోకి మంగళవారం ప్రవేశపెట్టింది. ధర రూ.58,300. దీనితో పాటు శామ్సంగ్ గేర్ ఎస్ స్మార్ట్‌వాచ్(ధర రూ.28,900), గేర్ సర్కిల్(ధర రూ.8,500) డివైస్‌లను కూడా శామ్సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. శామ్సంగ్ ఖరీదైన స్మార్ట్‌డివైస్ ఈ గెలాక్సీ నోట్ 4 డివైస్‌ను శామ్సంగ్ కంపెనీ గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించింది. దీపావళి సందర్భంగా గెలాక్సీ నోట్ 4ను మార్కెట్లోకి తెస్తున్నామని శామ్సంగ్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ (మొబైల్ అండ్ ఐటీ) ఆశిమ్ వార్శి చెప్పారు. శామ్సంగ్ కంపెనీ భారత్‌లో అందిస్తున్న అత్యంత ఖరీదైన స్మార్ట్ డివైస్ ఇది. గెలాక్సీ నోట్ 3(ఎన్900)ను రూ.38,900కు, గెలాక్సీ 5ఎస్‌ను రూ.36,000కు కంపెనీ విక్రయిస్తోంది. మెరుగుపరిచిన ఎస్పెన్ ఫీచర్‌తో, పెద్ద డిస్ప్లే, అత్యున్నతమైన ఫీచర్లతో గెలాక్సీ నోట్4ను రూపొందించామని ఆశిమ్ వివరించారు. ఈ గెలాక్సీ నోట్ 4లో 5.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. వేగంగా చార్జింగ్ కావడం ఈ ఫ్యాబ్లెట్ ప్రత్యేకత అని ఆశిమ్ వివరించారు. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుందని పేర్కొన్నారు. -
శామ్సంగ్ ఫ్యాక్టరీలో రూ.215 కోట్ల దోపిడీ!
బ్రెజిల్లో 40 వేల ఫోన్లు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు శావో పౌలో: బ్రెజిల్‌లోని శావో పౌలోకు సమీపంలో గల శాంసంగ్ కంపెనీ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి భారీ దోపిడీ చోటుచేసుకుంది. బ్రెజిలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన కాంపినాస్ వద్ద గల శామ్సంగ్ ఫ్యాక్టరీలోకి చొరబడిన 20 మంది సాయుధ దొంగలు ఏకంగా రూ. 215 కోట్ల విలువైన 40వేల సెల్ఫోన్లు, కంప్యూటర్లను ట్రక్కుల్లో వేసుకుని పరారయ్యారు. తొలుత నైట్‌షిఫ్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును ఫ్యాక్టరీకి దగ్గరలో హైజాక్ చేసిన దొంగలు.. బస్సులోని 8 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారి గుర్తింపుకార్డులు, సెల్ఫోన్లు లాక్కున్నారు. ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. ఫ్యాక్టరీలోకి ప్రవేశించిన తర్వాత బందీలను అడ్డుపెట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కున్నారు. ఉద్యోగుల నుంచి సెల్ఫోన్లు తీసుకున్నారు. ఏమీజరగనట్లే ఉండాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు ఈ దోపిడీ తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో తిరుగుతూ తీరిగ్గా పని కానిచ్చేశారు. ఈ సంఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. విలువైన వస్తువులున్న చోటికే దొంగలు వెళ్లడం చూస్తుంటే.. ఈ దోపిడీ వెనక ఇంటిదొంగల పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే దోపిడీకి పరికరాల మొత్తం విలువను నిర్ధారించుకోవాల్సి ఉందని దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ వెల్లడించింది. -
భారత్‌లో తొలిసారిగా శామ్సంగ్ కర్వ్డ్ టీవీలు
ధరలు రూ. 1-4.49 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ భారత మార్కెట్లోకి కర్వ్డ్ టీవీలను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ. 1.04 లక్షల నుంచి రూ.4.49 లక్షల రేంజ్లో ఉన్నాయని శామ్సంగ్ ఇండియా ఎండీ(సేల్స్) ఎస్.కె. కిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నేపథ్యంలో హై-ఎండ్ కొనుగోలుదారులు లక్ష్యంగా ఈ టీవీలను మార్కెట్లోకి తెస్తున్నామని పేర్కొన్నారు. కర్వ్డ్ రేంజ్లో మొత్తం పది టీవీలను అందిస్తున్నామని వివరించారు. వీటిల్లో ఆల్ట్రా హై డెఫినిషన్(యూహెచ్డీ), ఎల్ఈడీ టెక్నాలజీ టీవీలున్నాయని పేర్కొన్నారు. పూర్తి హై డెఫినిషన్ టీవీలతో పోల్చితే ఈ కర్వ్డ్ టీవీల రిజల్యూషన్, పిక్సెల్స్ నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని వివరించారు. టీవీ వీక్షణంలో కర్వ్డ్ టీవీ కొత్త విప్లవం సృష్టించనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.