శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఇదిగో... | Samsung Netherlands taking pre-orders for Galaxy S6, S6 edge | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఇదిగో...

Published Tue, Mar 3 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఇదిగో...

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఇదిగో...

- ఐఫోన్6కు పోటీ
- వచ్చే నెల 10 నుంచి విక్రయాలు

బార్సిలోనా: యాపిల్ ఐఫోన్ 6కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను తెస్తోంది. ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015లో వీటిని ప్రదర్శించింది. ‘యాపిల్ పే’కు పోటీగా ‘శామ్‌సంగ్ పే’ మొబైల్ పేమెంట్‌ను కూడా శామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఈ ఫోన్‌ల విక్రయాలు వచ్చే నెల 10 నుంచి ప్రారంభం అవుతాయి.

32, 64, 128 జీబీ స్టోరేజ్‌ల్లో ఈ ఫోన్‌లను అందిస్తున్నామని కంపెనీ సీఈఓ జె.కె. షిన్ చెప్పారు. ఈ ఫోన్లలో 5.1 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 64-బిట్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన 14 నానో మీటర్ మొబైల్ ప్రాసెసర్(ఇది ప్రపంచంలోనే అత్యంతాధునిక మెమరీ టెక్నాలజీ), 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెర్లైస్ చార్జింగ్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. 10 నిమిషాలు చార్జింగ్ చేస్తే 4 గంటలు ఉపయోగించుకోవచ్చని వివరించారు. గెలాక్సీ 6 ఎడ్జ్‌లో రెండు వైపులా కర్వ్‌డ్ స్క్రీన్స్ ఉంటాయని... ఒకే లేయర్ డిస్‌ప్లేపై 3 విభిన్నమైన స్క్రీన్‌లు పనిచేస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement