
భోపాల్: ఒక యువతి రైల్వే క్రాసింగ్ గేటు వద్ద వెళ్లి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను ఒక ఆటోడ్రైవర్ తన ప్రాణాలను తెగించి కాపాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లోని ఒక రైల్వేగేటువద్ద రైలు వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులు రోడ్డు దాటకుండా రైలు ఉద్యోగి గేటు వేశారు.
రోడ్డుకు ఇరువైపులా ప్రయాణికులు నిల్చుండిపోయారు. అప్పుడు ఒక యువతి గాబరాగా రైల్వే గేటు ముందు నిలబడింది. ఆ తర్వాత రైలు సమీపిస్తుండగా.. ఒక్కసారి రైల్వేగేటు దాటుకుని పోయి పట్టాల మీద వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ యువతి ప్రవర్తన పట్ల అనుమానంగా చూశాడు. రైలు దగ్గరకు వస్తుంది.. ఆ క్షణంలో ఒక్కసారిగా వెళ్లి రైలు పట్టాలపై నిలబడిన ఆ యువతిని బలవంతంగా పక్కకు లాగాడు.
ఒక్క క్షణం ఆలస్యమైన ఆ యువతి ప్రాణాలకు పెద్ద ప్రమాదమే సంభవించేది. ఆ తర్వాత యువతి బిగ్గరగా ఏడ్చింది. అక్కడున్న స్థానికులు ఆమెను ఓదార్చారు. కాగా, ఉద్యోగం రాకపోవడం పట్ల తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని యువతి కన్నీటి పర్యంతమయ్యింది. ఆ యువతికి అక్కడున్న వారు ధైర్యం చెప్పారు. కాసేపటికి యువతి తెరుకుంది. యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బాధిత యువతి ప్రాణాలు కాపాడిన ఆటోడ్రైవర్ మోసిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అందరికి సమస్యలు ఉంటాయని.. సమస్యలకు పరిష్కారం.. చావు కాదని’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి..’,‘ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తికి సెల్యూట్ ’ అంటూ నెటిజన్లు కామెంట్‌లు పెడుతున్నారు.
नौकरी ना मिलने से परेशान युवती सुसाइड के इरादे से पटरी पर खड़ी हो गई. ट्रेन आती देख ऑटो ड्राइवर ने खींचकर बचाई जान. वीडियो हुआ वायरल. ऑटो चालक मोहसिन की सूझबूझ और दिलेरी को सलाम
— Ravish Pal Singh (@ReporterRavish) September 28, 2021
नोट: सुसाइड किसी समस्या का समाधान नहीं! pic.twitter.com/CZscsq1CX7
చదవండి: Video Viral: వలలో పడ్డ భారీ షార్క్.. పాత రికార్డులన్నీ బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment