Railway crossing gates
-
‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’
భోపాల్: ఒక యువతి రైల్వే క్రాసింగ్ గేటు వద్ద వెళ్లి రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను ఒక ఆటోడ్రైవర్ తన ప్రాణాలను తెగించి కాపాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్‌లోని ఒక రైల్వేగేటువద్ద రైలు వస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులు రోడ్డు దాటకుండా రైలు ఉద్యోగి గేటు వేశారు. రోడ్డుకు ఇరువైపులా ప్రయాణికులు నిల్చుండిపోయారు. అప్పుడు ఒక యువతి గాబరాగా రైల్వే గేటు ముందు నిలబడింది. ఆ తర్వాత రైలు సమీపిస్తుండగా.. ఒక్కసారి రైల్వేగేటు దాటుకుని పోయి పట్టాల మీద వెళ్లి నిలబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ యువతి ప్రవర్తన పట్ల అనుమానంగా చూశాడు. రైలు దగ్గరకు వస్తుంది.. ఆ క్షణంలో ఒక్కసారిగా వెళ్లి రైలు పట్టాలపై నిలబడిన ఆ యువతిని బలవంతంగా పక్కకు లాగాడు. ఒక్క క్షణం ఆలస్యమైన ఆ యువతి ప్రాణాలకు పెద్ద ప్రమాదమే సంభవించేది. ఆ తర్వాత యువతి బిగ్గరగా ఏడ్చింది. అక్కడున్న స్థానికులు ఆమెను ఓదార్చారు. కాగా, ఉద్యోగం రాకపోవడం పట్ల తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని యువతి కన్నీటి పర్యంతమయ్యింది. ఆ యువతికి అక్కడున్న వారు ధైర్యం చెప్పారు. కాసేపటికి యువతి తెరుకుంది. యువతిని ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బాధిత యువతి ప్రాణాలు కాపాడిన ఆటోడ్రైవర్ మోసిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అందరికి సమస్యలు ఉంటాయని.. సమస్యలకు పరిష్కారం.. చావు కాదని’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి..’,‘ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తికి సెల్యూట్ ’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. नौकरी ना मिलने से परेशान युवती सुसाइड के इरादे से पटरी पर खड़ी हो गई. ट्रेन आती देख ऑटो ड्राइवर ने खींचकर बचाई जान. वीडियो हुआ वायरल. ऑटो चालक मोहसिन की सूझबूझ और दिलेरी को सलाम नोट: सुसाइड किसी समस्या का समाधान नहीं! pic.twitter.com/CZscsq1CX7 — Ravish Pal Singh (@ReporterRavish) September 28, 2021 చదవండి: Video Viral: వలలో పడ్డ భారీ షార్క్.. పాత రికార్డులన్నీ బ్రేక్ -
బాధ్యత ఎవరిది ?
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌లో కాపలా లేని రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం పసిపిల్లల ప్రాణాలు బలిగొనడంతో ఈ పాపం ఎవ్వరిదన్న చర్చ మరోసారి జరుగుతోంది. 2018 మార్చి 31 నాటికి దేశంలో 3,479 కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ క్రాసింగ్‌లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే యూపీ రెండో స్థానంలోఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 1357 కాపలా లేని క్రాసింగ్‌లు ఉన్నాయి. దేశంలో ఇలాంటి క్రాసింగ్లను 2020 సంవత్సరంలోగా పూర్తిగా తొలగించాలని రైల్వే శాఖ డెడ్‌లైన్ విధించుకుంది. వచ్చే రెండేళ్లలో వీటి దగ్గర గేట్లు ఏర్పాటు చేసి కాపలాదారుల్ని నియమించడం, లేదంటే రోడ్ ఓవర్ బ్రిడ్జి , రోడ్ అండర్ వంతెనలు నిర్మించడానికి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ లోగా రైల్వే క్రాసింగ్‌ల దగ్గర ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల నివారణకు గేట్ మిత్ర 2014–15 సంవత్సరంలో కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల దగ్గర ఏకంగా 50 ప్రమాదాలు జరిగి 130 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. అప్పట్నుంచి రైల్వే శాఖ ఈ క్రాసింగ్‌ల దగ్గర ప్రమాదాలను నివారించడానికి గేట్ మిత్ర అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వాలంటీర్లను నియమించింది. రైలు వచ్చినప్పుడల్లా ట్రాక్‌లను దాటే వాహనదారుల్ని, పాదచారుల్ని అప్రమత్తం చేయడమే వీరి పని. అయితే ఈ వాలంటీర్లకు తగిన సదుపాయాలు కల్పించడంలో రైల్వే శాఖ విఫలమవడంతో వారి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. అయితే కాపలా లేని క్రాసింగ్‌లు తొలగించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంది. కాపలా లేని క్రాసింగ్‌ల దగ్గర వచ్చి పోయే వాహనాల సంఖ్య ఆధారంగా వాటిని అయిదు రకాలుగా విభజించింది. ప్రతీ గంటలో ఆ ట్రాక్ మీదుగా ఎన్ని రైళ్లు వెళతాయి, అదే సమయంలో ఎన్ని వాహనాలు వెళతాయి అన్న లెక్కలతో ట్రైన్ వెహికల్స్ యూనిట్స్‌ని (టీయూవీ) అంచనా వేసింది. టీయూవీలు 10 వేలు దాటితే కేటగిరీ ఒకటి కిందకి వస్తాయి. అంటే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాటిని ముందుగా తొలగించే కార్యక్రమాలు చేపట్టింది. అలా గత ఏడాది రైల్వే శాఖ 1464 కాపలా లేని రైల్వే క్రాసింగ్లను తొలగించింది. ఈ చర్యల వల్ల 2016–17 ప్రమాదాల సంఖ్య బాగా తగ్గింది. ఆ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన కుషీనగర్ టీయూవీ లెక్కల్లో చూస్తే 2 వేల కంటే తక్కువే.. అంటే కేటగిరీ అయిదు కిందకే వస్తుంది. అయినా ప్రమాదం జరిగిందంటే డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే శాఖ ఆరోపిస్తోంది. చట్టం ఏం చెబుతోంది ? వాస్తవానికి కాపలా లేని చోట రైల్వే పట్టాలు దాటినప్పుడు వాహనదారులు, పాదచారులే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని, రైలు వస్తోందా లేదా అని ఒకటికి రెండు సార్లు గమనించుకొని అప్పుడే దాటాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని అంటున్నారు. రైల్వే క్రాసింగ్‌ల దగ్గర వాహనదారుల్ని జవాబుదారీలుగా చేస్తూనే మన చట్టాలు కూడా రూపొందాయి. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 131 ప్రకారం, భారత రైల్వే చట్టం సెక్షన్ 161 ప్రకారం కాపలా లేని క్రాసింగ్లను దాటేటప్పుడు జరిగే కష్టనష్టాల బాధ్యత వాహనదారులే భరించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ ప్రయత్నాలు ఎలా ఉన్నా రైల్వే క్రాసింగ్‌ల దగ్గర వాహనదారులే జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మృత్యు గేట్లు
ఖమ్మం: రైల్వే క్రాసింగ్ గేట్లు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. జిల్లా రైల్వే జోన్ పరిధిలోని మొత్తం 42 రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, అందులో 30 శాతం పైగానే గేట్లు లేవని రైల్వే అధికారులే చెపుతున్నారు. ఈ గేట్ల ఏర్పాటులో రైల్వే శాఖ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి తోడు మానవ తప్పిదాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రైల్వే క్రాసింగ్‌లు దాటి స్కూళ్లకు వెళ్లే పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మెదక్ జిల్లాలో ప్యాసింజర్ రైలు స్కూలు బస్సును ఢీకొని 20 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రుల గుండెలు గుభేల్మన్నాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాల మధ్యలో ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్లు, వాటి వద్ద రైల్వే ఉద్యోగులు లేకపోవడం, పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం, పలు చోట్ల అండర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు ప్రారంభించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు లేని చోట తక్షణమే నిర్మించాలని, కాపలా ఉద్యోగులను నియమించాలని రైలే ్వ అధికారులను కోరుతున్నారు. క్రాసింగ్‌ల వద్ద తరుచూ జరుగుతున్న ప్రమాదాలు... వరంగల్ జిల్లా సరిహద్దులోని గార్ల నుంచి కృష్ణాజిల్లా సరిహద్దు కొండపల్లి వరకు, డోర్నకల్ నుంచి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు వరకు జిల్లాలో రైల్వే లైన్లు ఉన్నాయి. ఈ లైన్ల మధ్యలో జిల్లా పరిధిలో 42 లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గార్ల నుంచి కొండపల్లి వరకు ఉన్న బ్రాడ్‌గేజీ లైన్లు జాతీయ రైల్వే లైన్లను కలుపుతూ ఉంటాయి. డోర్నకల్ నుంచి మణుగూరు వరకు ఉన్న లైన్లలో ఒకటి రెండు ప్యాసింజర్ ట్రైన్లతోపాటు, తరచూ బొగ్గును రవాణా చేసే రైళ్లు తిరుగుతుంటాయి. అయితే ఈ రైల్వే క్రాసింగ్‌లో పలుచోట్ల ఉద్యోగులు కాపలా ఉండగా, మరికొన్ని చోట్ల ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ, రైళ్లు వచ్చే సమాచారం కానీ ఇచ్చే నాథుడే ఉండడు. గేట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా వాటి కింద నుంచి వాహ నాలు తీసుకెళ్లి ప్రమాదానికి గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా పరిధిలోకి వచ్చే మోటమర్రి- జగ్గయ్యపేట మధ్యలో ఉన్న క్రాసింగ్ వద్ద గతంలో ట్రాక్టర్‌ను రైలు ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందారు. గంగినేని - చెరువు మాదారం మధ్యలో జరిగిన ప్రమాదంలో పలుమార్లు గేదెలు, గొర్రెలు చనిపోయాయి. మధిరలో ఉన్న గేట్ పక్కనుంచే వాహనాలు వెళ్లి పలువురు మృతి చెందగా స్పందించిన అధికారులు గేటుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం- కొండపల్లి మధ్యలో ఉన్న లైన్లకు రైల్వే ఆధునీకరణలో భాగంగా గేట్లకు సిగ్నల్‌కు అనుసంధానం చేశారు. దీంతో గేట్లు తీసిఉంటే ప్రమాద హెచ్చరిక వెలగడంతో రైలు డ్రైవర్లు అప్రమత్తం అవుతారు. కానీ డోర్నకల్- మణుగూరు లైన్లలో మాత్రం ఇలాంటి అవకాశం లేదు. దీనికి తోడు ఈ లైన్లలో కొత్తగూడెం పార్కు, భేతంపూడి, తడికలపుడి తండ, కారేపల్లి- ఇల్లెందు మధ్యలో 3 కేకే గేట్, ఇల్లెందు సిటీస్టేషన్ గేట్ల వద్ద లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. వీటితోపాటు గార్ల మండలం పోచారం తదితర మారుమూల గ్రామాలు, తండాల సమీపంలో ఉన్న గేట్ల గురించి రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెపుతున్నారు. ఈ గేట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాల బస్సులు, ఆటోలు, లారీలు తిరుగుతుంటాయి. వాహనాలను గేటు దాటించేటప్పుడు రైలు వస్తుందా లేదా అని చూసుకొని భయంతో వెళ్లాల్సి వస్తోందని డ్రైవర్లు అంటున్నారు. మెదక్ ఘటపై దిగ్భ్రాంతి... మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో ముక్కుపచ్చలారని పిల్లలు మృతి చెందడంతో జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం నుంచి మారాం చేస్తే.. అమ్మ లాలించి.. గోరుముద్దలు పెట్టి స్కూల్ బస్సు ఎక్కించి టా.. టా.. చెబుతూ వెళ్లిన పిల్లలు కాసేపట్లో మృత్యువాత పడటం చూసి కన్నీరు పెట్టని హృదయాలు లేవు. రోజువారిగా తమ పిల్లలు కూడా స్కూల్ బస్సు ఎక్కి వెళ్తారు... వారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో.. అని ఊహించుకుంటూ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం చండ్రుగొండ సమీపంలో ఉన్న పెదవాగులో పడి 8 మంది చిన్నారులు మృతి చెందిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.