మొక్కలతోనే మానవ మనుగడ | plants saves human beings | Sakshi
Sakshi News home page

మొక్కలతోనే మానవ మనుగడ

Published Wed, Jul 27 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

విశ్వనాథపల్లిలో మొక్కలు నాటుతున్న రఘువీర్‌

విశ్వనాథపల్లిలో మొక్కలు నాటుతున్న రఘువీర్‌

కారేపల్లి: మానవ మనుగడ మొక్కలతోనే ప్రారంభం అయిందని ఫారెస్టు స్టేట్‌ అబ్సర్వర్‌ రఘువీర్‌ తెలిపారు. బుధవారం విశ్వనాథపల్లి గ్రామంలో ఆమన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దట్టమైన అడవులను పునరిద్ధరించుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, అప్పుడే రాష్ట్రం హరిత తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు.
గిద్దెవారిగూడెంలో ర్యాలీ.. ప్రాథమికోన్నత పాఠశాలలో ఫారెస్టు స్టేట్‌ అబ్సర్వర్‌ మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ పీఏ, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు దయాకర్‌రెడ్డి, జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, ఎంపీపీ బాణోతు పద్మావతి, తహశీల్దార్‌ ఎం మంగీలాల్, ఎంపీడీఓ ఎన్‌ శాంతాదేవి, ఎఫ్‌ఆర్‌ఓ శ్రీహరిప్రసాద్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement