కరోనాపై పాట.. దానికే బలైన నిస్సార్‌! | Writer And Poet Nissar Last Breath Due To Coronavirus At Gandhi Hospital | Sakshi
Sakshi News home page

కరోనాపై పాట రాసి.. దానికే బలైన నిస్సార్‌!

Published Wed, Jul 8 2020 12:02 PM | Last Updated on Wed, Jul 8 2020 6:57 PM

Writer And Poet Nissar Last Breath Due To Coronavirus At Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనాపై ప్రజలను చైతన్యం చేసిన కవిగాయకుడు నిస్సార్‌ను మహమ్మారి బలితీసుకుంది. కోవిడ్‌ బారినపడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్‌ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిస్సార్‌ స్వగ్రామం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేస్తూ, జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు. ఇక నిస్సార్‌ రాసిన పాటను సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస​ ఆలపించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ మాట ప్రేక్షకాదరణ పొందింది.
(స‌చివాల‌యం కూల్చివేత‌: అత్య‌వ‌స‌రంగా విచారించ‌లేం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement