సాక్షి, హైదరాబాద్ (గాంధీఆస్పత్రి): కరోన వైరస్ తాకిడికి ప్రపంచం మొత్తం మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపధ్యంలో ఎటువంటి అదురు, బెదురు లేకుండా ఊయల ఊగుతూ భయమనేది తెలియకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నారులు. తెలంగాణ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ముందు నుంచి వెల్లేందుకే జంకుతున్న క్రమంలో గాంధీఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలో మాస్క్‌లు ధరించకుండా ఎటువంటి భయం లేకుండా చిన్నారులు ఆటలాడుకుంటున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. బాల్యానికి మించిన మధురస్మృతి లేదంటారు.
Comments
Please login to add a commentAdd a comment