spending
-
పిల్లల చేతిలో హెల్‌ఫోన్!
సాక్షి, అమరావతి: కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లల్లో సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయినా.. ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లో సెల్‌ఫోన్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 9 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున మూడు గంటలకు పైగా సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారు. లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వేలో 61 శాతం తల్లిదండ్రులు ఈ అంశాన్ని వెల్లడించారు. తమ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడటం, ఓటీటీ యాప్స్‌లో సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46 వేల మంది తల్లిదండ్రులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు. దూకుడు.. అసహనం పెరిగాయ్ సర్వేలో భాగంగా సెల్‌ఫోన్ అతి వినియోగంతో పిల్లల సామాజిక ప్రవర్తన/మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెల్‌ఫోన్ వినియోగం కారణంగా పిల్లల్లో గమనించిన మార్పులు ఏమిటని 11,697 మంది తల్లిదండ్రులను ఆరా తీయగా.. 39 శాతం పిల్లల్లో దూకుడు స్వభావం పెరిగినట్టు తల్లిదండ్రులు చెప్పారు. 37 శాతం పిల్లల్లో అసహనం, 25 శాతం పిల్లల్లో అతి క్రియాశీలత (హైపర్ యాక్టివ్నెస్) పెరిగిందని వెల్లడించారు. 22 శాతం పిల్లల్లో నిస్పృహ పెరిగినట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్నంతసేపూ ఫోన్‌తోనే.. పట్టణ ప్రాంతాల్లోని చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌తో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీ పిల్లలు రోజుకు సగటు ఎంత సమయం సెల్‌ఫోన్ వినియోగిస్తున్నారని 11,507 మందిని ఆరా తీయగా.. 6 గంటల మేర సెల్‌ఫోన్‌తో గడుపుతున్నట్టు 15 శాతం మంది తెలిపారు. 3నుంచి 6 గంటల పాటు తమ పిల్లలు ఫోన్ వినియోగిస్తున్నట్టు 46 శాతం మంది, 1నుంచి 3 గంటల మధ్య వినియోగిస్తున్నట్టు 39 శాతం మంది పేర్కొన్నారు. అయితే ఓటీటీ.. లేదంటే సోషల్ మీడియా మీ పిల్లలు సెల్‌ఫోన్ ఎందుకోసం వినియోగిస్తున్నారని 12,017 మందిని ప్రశ్నించి.. సోషల్ మీడియా, ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, ఇతర వ్యాపకాలు, ఏమీ చెప్పలేం అని ఆప్షన్లు ఇవ్వగా.. చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లతో సమాధానాలిచ్చారు. 37 శాతం మంది తమ పిల్లలు ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌ను చూస్తున్నట్టు చెప్పారు. 35 శాతం మంది వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, బీ రియల్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పిల్లలు గడుపుతున్నట్టు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు 33 శాతం మంది, ఇతర వ్యాపకాలని 10 శాతం, ఏమీ చెప్పలేమని 2 శాతం మంది వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. పాఠశాల, కళాశాలల్లో అలసిపోయి ఉంటారని ఇంటికి రాగానే పిల్లలు సెల్‌ఫోన్ వాడుతున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆటవిడుపు కోసం చేసే ఈ చర్య క్రమంగా వ్యసనంగా మారుతోంది. అదేవిధంగా హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసమని పిల్లలు అడిగిన వెంటనే సెల్‌ఫోన్ ఇచ్చేస్తుంటారు. అనంతరం వాళ్లు ఎంతసేపు ఫోన్‌ను వినియోగిస్తున్నారనేది పట్టించుకోరు. ఈ విధానాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత సేపు వారితో గడపాలి. – డాక్టర్ కేవీ రామిరెడ్డి, సూపరింటెండెంట్, మెంటల్ కేర్ హాస్పిటల్, వైజాగ్ -
వీళ్లకి కరోనా అంటే భయం లేదు..
సాక్షి, హైదరాబాద్ (గాంధీఆస్పత్రి): కరోన వైరస్ తాకిడికి ప్రపంచం మొత్తం మాస్క్‌లు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ తీవ్ర భయాందోళనకు గురవుతున్న నేపధ్యంలో ఎటువంటి అదురు, బెదురు లేకుండా ఊయల ఊగుతూ భయమనేది తెలియకుండా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిన్నారులు. తెలంగాణ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ముందు నుంచి వెల్లేందుకే జంకుతున్న క్రమంలో గాంధీఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలో మాస్క్‌లు ధరించకుండా ఎటువంటి భయం లేకుండా చిన్నారులు ఆటలాడుకుంటున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. బాల్యానికి మించిన మధురస్మృతి లేదంటారు. చదవండి: యాపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగోడి ఫొటో -
భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా? లేదా పెరుగుతున్నా యా? అన్న అంశంపై భవిష్యత్ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఎస్అండ్పీ విడుదల చేసిన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైల్ ద్రవ్యోల్బణం సవాలుగా ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించిన తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి. ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుంది: ఫిచ్ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ ఒక నివేదికలో పేర్కొంది. ‘‘ఆహారం, ఆల్కహాల్యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి 2020లో కుటుంబాలు తమ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు’’ అని ఫిచ్ వివరించింది. -
రూ.14.7 లక్షల కోట్లకు ఈ-టైలింగ్
ఆన్లైన్ షాపింగ్ వచ్చే అయిదేళ్లలో 35 శాతం వార్షిక వృద్ధితో రూ.14.7 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఇందులో అత్యధిక వృద్ధి డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ నుంచే వస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అవెండస్ క్యాపిటల్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశీయ డైరెక్ట్ టు కన్జూమర్ మార్కెట్ 2025 నాటికి రూ.7.35 లక్షల కోట్లు ఉండనుంది. 2019లో భారత్ రిటైల్ మార్కెట్ రూ.73.2 లక్షల కోట్లు. ఈ–టైలింగ్ తోడు కావడంతో మొత్తం మార్కెట్ 2025 నాటికి రూ.127.5 లక్షల కోట్లకు చేరనుంది. 2019లో 17 శాతంగా ఉన్న మోడర్న్ ట్రేడ్ అయిదేళ్లలో 31 శాతానికి పెరగనుంది. 63.9 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్‌ను నడిపిస్తున్నారు. ఏటా ఈ యూజర్ల సంఖ్య 24% అధికమవుతోంది. మూడేళ్లలో కొత్తగా 8 కోట్ల మంది తోడు కావడంతో ఆన్లైన్ కస్టమర్ల సంఖ్య 13 కోట్లకు ఎగసింది. గతేడాది దేశీయ ఈ–టైల్ మార్కెట్ రూ.2.92 లక్షల కోట్లుంది. మొత్తం రిటైల్‌లో ఇది 4 శాతం. ఆన్లైన్ వ్యవస్థ, కస్టమర్ల అవసరాలు అధికమవడంతో కొత్త వ్యాపార విధానాలు అనుకూలంగా ఉండడం కారణంగా డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) వ్యవస్థ వృద్ధి చెందుతోంది. బ్యూటీ, పర్సనల్ కేర్, ఫుడ్, బెవరేజెస్, ఫ్యాషన్ విభాగాలు డీ2సీ బ్రాండ్లను నడిపిస్తున్నాయి. లెన్స్‌కార్ట్, లిసియస్, బోట్ వంటివి ఈ రంగంలో పోటీపడుతున్నాయి. 2016 నుంచి దేశంలో కొత్తగా 600లకు పైగా ఇటువంటి స్టార్టప్ కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. -
పెళ్లి చేస్తారు.. రిటైరవుతారు!
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : పెళ్లి ఎలా చెయ్యాలి? తల్లిదండ్రులందరికీ... ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకిది పెద్ద సవాలే. నిజానికి పెళ్లి ఎలా అయినా చెయ్యొచ్చు. దానికి ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. తక్కువలో తక్కువగా వేలల్లో ముగించేయొచ్చు. అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనూ వచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... మధ్య తరగతి కుటుంబాల్లో... పెళ్లనేది చాలావరకూ వరుడి కుటుంబీకుల ఇష్టప్రకారం చేయాల్సి ఉంటుంది. సదరు సంబంధం కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కూడా. నిజానికి పెళ్లికి ముందు నుంచే సన్నద్ధం అయ్యేవారు మనలో చాలా తక్కువ. మునుపటికన్నా ఇపుడు వివాహానికి ప్రాధాన్యం పెరిగింది. దాంతోనే ఖర్చులూ పెరిగాయి. అందుకని ముందు నుంచే ప్రణాళిక వేసుకుని... ఆ మేరకు పిల్లల వివాహ అవసరాల కోసం కొంత నిధిని సమకూర్చుకోవడం తప్పనిసరి. ఉదాహరణకు రాజమండ్రికి చెందిన సుకుమార్‌నే తీసుకుంటే... తనకు 17 ఏళ్ల ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉన్నత విద్య పూర్తయ్యాక ఆమెకు పెళ్లి చేయాలన్నది సుకుమార్ ఆలోచన. ఆమె పెళ్లికి సుమారు 8–10 ఏళ్ల వ్యవధి ఉంది. అలాగే, తన రిటైర్మెంట్ జీవితం కోసం కూడా కొంత నిధిని సమకూర్చుకోవాలని భావించాడు. ఇందుకు మరో పదేళ్ల వ్యవధి ఉంది. దీనికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా ఒకసారి చూద్దాం... వివాహం కోసం ఏం చేయొచ్చంటే... హరిత వివాహ అవసరాల కోసం రూ.25 లక్షలను సమకూర్చుకోవాలన్నది సుకుమార్ లక్ష్యం. అది కూడా ఇప్పటి ఖర్చుల ఆధారంగా అతడు వేసుకున్న అంచనా. 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా చూస్తే మరో ఎనిమిదేళ్ల తర్వాత హరిత వివాహ సమయానికి రూ.46 లక్షలు అవసరం అవుతాయి. సుకుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రతీ నెలా కనీసం రూ.25,000 పింఛను రూపంలో వస్తుందని అతడి అంచనా. అయినా సరే... రిటైర్మెంట్ తర్వాత అనూహ్యంగా వచ్చే అవసరాల కోసం అతను రూ.1.5 కోట్లు సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రణాళిక ఇలా ఉండాలి సుకుమార్ ప్రతి నెలా తీసుకునే వేతనం రూ.60,000. అదృష్టవశాత్తూ సుకుమార్ అర్ధాంగి జ్యోతి కూడా ఉద్యోగే. ఆమె నెలసరి వేతనం రూ.40,000. వీరి నెలసరి కుటుంబ ఖర్చు రూ.50,000. దీంతో ప్రతి నెలా వారి మిగులు నిధులు రూ.50,000. ఇందులో రూ.45,000ను బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తుండగా, మిగిలిన రూ.5,000ను ఈక్విటీ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి కుమార్తె హరిత ఇంటర్ చదువుతోంది. తరవాత ఇంజనీరింగ్ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇక సుకుమార్‌కు రూ.కోటి మేర టర్మ్ బీమా పాలసీ ఉంది. దీన్ని ఆయన పనిచేస్తున్న సంస్థే సమకూర్చింది. వైద్య బీమా పాలసీ కూడా సంస్థ అందిస్తున్నదే ఉంది. మరో పదేళ్లలో సుకుమార్ రిటైర్ అవుతారు. కనుక తర్వాత అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడిగా ఓ వైద్య బీమా పాలసీ ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆ వయసులో వైద్య బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. పెట్టుబడులు, మార్పులు... సుకుమార్‌కు ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాలో రూ.25 లక్షలున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీల రూపంలో రూ.40 లక్షలున్నాయి. సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. దీని విలువ రూ.1.15 కోట్లు. సుకుమార్ పెట్టుబడుల్లో సింహభాగం రికరింగ్ డిపాజిట్లకే వెళుతోంది. అతని కుమార్తె వివాహానికి ఇంకా కనీసం ఎనిమిదేళ్ల వ్యవధి ఉంది. కనుక పెట్టుబడుల్లో కొంత మేర అధిక రాబడులకు కేటాయించుకోవచ్చు. రూ.50,000 పెట్టుబడుల్లో కనీసం రూ.30,000ను ఈక్విటీ బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్, లార్జ్‌క్యాప్ ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవాలి. మిగిలిన రూ.20,000ను ఆర్డీకి మళ్లించొచ్చు. బ్యాలన్స్డ్ ఫండ్స్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ ఫండ్, ఎల్అండ్టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్ ఫండ్ పథకాలు బ్యాలన్స్డ్ ఫండ్స్‌కు పనితీరు పరంగా మంచి చరిత్ర ఉంది. లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విధంగా పెట్టుబడులు పెడితే వార్షికంగా 12 శాతం రాబడి అంచనాల మేరకు 2026 నాటికి రూ.48.5 లక్షలు సమకూరుతుంది. దీంతో సుకుమార్ కుమార్తె హరిత వివాహ అవసరాలకు సరిపడా నిధి చేతికి అందుతుంది. ఇక రికరింగ్ డిపాజిట్లో ప్రతీ నెలా చేసే రూ.20,000 పెట్టుబడి సైతం 2028 నాటికి రూ.34 లక్షలు అవుతుంది. వార్షికంగా 7 శాతం రాబడుల ఆధారంగా వేసిన అంచనా ఇది. ఇక బ్యాంకు ఎఫ్‌డీల్లో ఉన్న రూ.40 లక్షలను కదపకుండా అలానే కొనసాగిస్తే 7 శాతం రాబడి ఆధారంగా 2028 నాటికి (సుకుమార్ రిటైర్మెంట్ అయ్యే సంవత్సరం) రూ.78.7 లక్షలు అవుతాయి. అలాగే, ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న రూ.25 లక్షలను కూడా లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీంతో పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.77.6 లక్షలు అవుతాయి. దీంతో ఈ మొత్తం కలిపి సుకుమార్ రిటైర్మెంట్ నాటికి రూ.1.9 కోట్లు అవుతాయి. -
తలకు మించిన ఖర్చు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొప్పున్నవాళ్లు ఏ ముడి వేసినా అందమేనంటారు. అంటే... ఏ స్టయిల్ చెయ్యడానికైనా ముందు జుట్టుండాలి కదా!! బహుశా... అందుకేనేమో!! భారతీయులు తల వెంట్రుకల సంరక్షణకు (హెయిర్ కేర్) ఏటా ఏకంగా రూ.19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. సౌందర్య పోషణ (పర్సనల్ కేర్) ఉత్పత్తుల్లో హెయిర్ కేర్ వాటా అధికమనేది మార్కెట్ వర్గాల మాట. ఈ ప్రాధాన్యాన్ని చూసే... ఫార్మాస్యూటికల్ కంపెనీలతోపాటు ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. నిజానికిపుడు జుట్టు రాలిపోవడం, పలుచబారడం, కొత్త వెంట్రుకలు రాకపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. దీనికి సమతుల ఆహార లేమి, ఒత్తిడి, లైఫ్‌స్టైల్, హార్మోన్ల అసమతౌల్యం, వాతావరణ కాలుష్యం వంటి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్లే అధిక సమస్యలు వస్తున్నాయన్నది ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రజిత దామిశెట్టి మాట. దేశంలో ఐదుగురు మహిళల్లో ఒకరు కేశ సంబంధ సమస్యతో బాధపడుతున్నారని ఆమె చెప్పగా... పురుషుల్లో 11 శాతం మంది బాధితులున్నట్లు ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ తెలియజేసింది. ఇదీ...హెయిర్ కేర్ మార్కెట్.. తల వెంట్రుకల సంరక్షణకు భారతీయులు ఏటా రూ.19,000 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక సాధారణ హెయిర్ ఆయిల్స్, షాంపూలు, క్రీమ్స్, జెల్స్ కోసం చేసే వ్యయం దీనికి అదనం. భారత్‌లో 100కుపైగా ప్రముఖ కంపెనీలు ఈ మార్కెట్లో పోటీపడుతున్నాయి.‘‘కేశ సంరక్షణపై ప్రజల్లో అవగాహన రావడం, మధ్యతరగతి ప్రజలు అధికమవడం కూడా ఈ మార్కెట్ పెరుగుదలకు దోహదం చేస్తోంది’’ అని గ్లెన్‌మార్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) రాజేశ్ కపూర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. కేశ సంరక్షణకు వైద్యులు సిఫార్సు చేసిన మందులు, చికిత్సలకు భారతీయులు ఏటా కనీసం రూ.600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్లు చెప్పారాయన. డ్రాప్ అయ్యేవారే ఎక్కువ.. కేశ సమస్యల పరిష్కారానికి కనీసం 6–8 నెలల పాటు సంరక్షణ ఉత్పత్తులు వాడాల్సి ఉందని రాజేశ్ కపూర్ వెల్లడించారు. ‘విద్య, డిజిటల్ మాధ్యమాలు, టీవీల కారణంగా అందంగా కనపడాలన్న తపన అందరిలోనూ వచ్చింది. అయితే చికిత్సను ఉత్సాహంగా మొదలు పెట్టినా.. మధ్యలోనే మానేసేవారే ఎక్కువ. వాస్తవానికి కేశ సంరక్షణ విషయంలో భారత్‌లో సరైన ఉత్పత్తులు తక్కువే ఉన్నాయి. 20 ఏళ్ల ట్రాక్ రికార్డును గమనించే 50 దేశాల్లో విజయవంతంగా అమ్ముడవుతున్న నూర్‌క్రిన్ ట్యాబ్లెట్లను మహిళల కోసం భారత్‌లో ప్రవేశపెట్టాం’ అని వివరించారు. -
నిధులుండీ...నిర్లక్ష్యం
– ఎంపీ నిధుల వినియోగంలోరాష్ట్రంలోనే చివరి స్థానం - రూ.17 కోట్లున్నా పట్టించుకోని వైనం - అంత నిర్లక్ష్యమేమిటంటూ ప్రజల ఆగ్రహం - పట్టించుకోని ఎంపీ మురళీ మోహన్ నిధులు ఉన్నాయి...ప్రతి ఏటా ఆ నిధులకు అదనంగా జతై రెట్టింపవుతున్నాయి. గత మూడేళ్లుగా రెండు పదుల కోట్లకు చేరుకున్నాయి. పాత నిధులను కూడా వీటితో కలిపి అభివృద్ధి పనులకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. బాధ్యత ఉన్న ఏ ప్రజా ప్రతినిధి అయినా ఏం చేస్తారు ... కనీసం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రాంతంలోనైనా వెచ్చించి ప్రగతి పూవులు పూయిస్తారు. కానీ ఏడు శాసన సభా నియోజకవర్గాల పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా ఎంపీ నిధుల కోటా కింద ఏటా రూ.5 కోట్లు చొప్పున గత మూడేళ్లలో రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందనంగా వచ్చి చేరాయి. ఈ లెక్కన మొత్తంగా రూ. 17.15 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. ఇన్ని నిధులు తన ఖాతాలో మూలుగుతున్నా తనకు పట్టనట్టు వ్యవహరించారు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ. 2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు గ్రామంలో మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలన్న ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) ఇది. ఇప్పటి వరకు ఇక్కడ వేలాది మంది మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా స్థిరపడ్డారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణం భవనం శిధిలావస్థకు చేరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మూరు గ్రామం వచ్చినప్పుడు భవన సమస్యను అధికారులు వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి ప్రజాప్రతినిధులందరికీ విన్నవించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూ.50 లక్షలతో మరమ్మతులు చేస్తే సరిపోతుందని అంచనా కూడా వేశారు. కానీ రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ఇదేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు అనేకం వెంటాడుతున్నాయి. కానీ వాటిపై ఎంపీ దృష్టి పడటం లేదు. తనకొచ్చిన ఎంపీ నిధులు మురగడం తప్ప ఉపయోగం లేకుండాపోతోంది. సహ ఎంపీలు పోటీపడి ఖర్చు పెడుతున్నా ఈయనకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు. అంతేలే...చుట్టం చూపుకని నియోజకవర్గానికొచ్చే ఎంపీకి సమస్యలు ఎలా పడతాయని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తనకొచ్చిన నిధులను ఏదో ఓ రోజు తనకో, అనుయాయులకో లబ్థి చేకూరేలా ఖర్చు పెట్టేద్దామనుకుంటున్నారేమో గానీ మూడేళ్లగా వచ్చిన నిధుల జోలికి మాత్రం ఆయన పోవడం లేదు. నిధులు విడుదల ఇలా... ఎంపీ మురళీమోహన్‌కు ఏటా రూ.5 కోట్లు చొప్పున మూడేళ్లపాటు రూ.15 కోట్లు విడుదలయ్యాయి. ఇవి కాకుండా గతంలో ఖర్చు కాకుండా మిగిలిపోయిన మరో రూ. 2.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ లెక్కన మొత్తంగా రూ.17.15 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ.5 కోట్లు విడుదలకు సిద్ధమై ఉంది. దీంతో కలిపి రూ. 22.15 కోట్లకు చేరనుంది. కానీ మురళీమోహన్‌కు చిత్తశుద్ధే లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.6.30 కోట్లు విలువైన 111 పనులకు మాత్రమే నిధులు కేటాయిస్తూ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రూ.2.32 కోట్ల విలువైన 36 పనులను ఇటీవల ప్రతిపాదించినవే. ఇవి కూడా పంపించకపోయి ఉంటే జిల్లాలో ప్రగతి మరింత దయనీయంగా ఉండేది. ఇక చేసిన పనుల ఖర్చు విషయానికొస్తే రూ. 3.44 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇలా వినియోగించుకోవచ్చు... ఈ నిధులతో తాగునీటికి, రోడ్లకు, భవనాలకు, కల్వర్టులకు, విద్యకు, విద్యుత్ సౌకర్యానికి, కుటుంబ ఆరోగ్యానికి, ఇరిగేషన్‌కు, సంప్రప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి, రైల్వే రోడ్లు, రైల్వే వంతెనలకు, శానిటేషన్‌కు, క్రీడలకు, మత్స్యసంపద అభివృద్ధికి, వ్యవసాయానికి హేండ్లూమ్స్కు, పట్టణాభివృద్ధికి ఇలా ... ఎన్నింటికో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఈ విభాగాలకు సంబంధించిన ఏ ఒక్క సమస్య మురళీ మోహన్‌కు పట్టకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. నిధులుండీ నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వచ్చే నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
► అభ్యర్థుల ఖర్చుపై నిఘా, ఇకపై లెక్కలు చెప్పాలి ►ఎన్నికల ఖర్చు నిర్ణయించాలని కేంద్రానికి ప్రతిపాదన ►2019 ఎన్నికల్లో ఓటేస్తే గుర్తు కనిపిస్తుంది ►తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ బి.కొత్తకోట/కదిరి: ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతా యని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి మార్చి మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై లోపాలున్నట్టు ఆరోపణలు రావడంతో వాటిని సరిచేశామన్నారు. ప్రస్తు త ఎన్నికల్లో అభ్యర్థులు లెక్కలు చెప్పాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నిఘా ఉంటుందని, ఓటర్లను ప్రలోభపె ట్టినా, ఓటుకు నగదు ఇచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మాదిరే ఎన్నికల వ్యయం ఎంత అన్నది నిర్ణయించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపామన్నారు. 2019 ఎన్నిక ల్లో ఈవీఎంలకు వీవీపీఏటీ (ఓటర్ వెరిఫి యబుల్ పేపర్ ట్రయల్)లను అమర్చు తామని చెప్పారు. దీంతో ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తు కనిపిస్తుందని చెప్పా రు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తులు చేసు కున్నారని, మొత్తం 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఈనెల 6న కొత్త ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. వీరికి సరికొత్త రంగుల గుర్తింపు కార్డులను జారీ చేస్తు న్నట్టు చెప్పారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సమావే శాల నిర్వహణ, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అంది స్తామన్నారు. 15–17 ఏళ్ల వయస్సున్న విద్యార్థులు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందితే జాతీయస్థాయిలో పోటీపడే అవకాశం ఉంటుందని, విజేతకు రాష్ట్రపతి బహుమతిని ప్రదానం చేస్తారని వివరిం చారు. ఇలా ఉండగా, సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని సతీసమేతంగా దర్శిం చుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లా డారు. ఓటరుకు ఆధార్‌కార్డు తప్పనిసరా అని ప్రశ్నించగా.. ఇప్పటికే దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించిందన్నారు. తదుపరి నిర్ణయం కూడా కోర్టు ఆదేశాల మేరకే ఉంటుందన్నారు. -
తిండిపై తక్కువ ఖర్చు చేసే దేశాలు అవేనట!
న్యూయార్క్: తిండి కలిగితే కండ కలుగునోయ్, కండ కలిగిన వాడేను మనుజోయ్! అన్నది ఓ కవి వాక్కు. ఈ వాక్కు ప్రకారం ప్రపంచంలోని ఎన్ని దేశాలు తిండి కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయో పరిశీలిస్తే అవాక్కవ్వాల్సిందే. అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువగా తిని పారేస్తున్నాయన్నది మన పొరపాటు అభిప్రాయం. దేశాలు ఎంత అభివృద్ధి చెందితే తిండిపై అంత తక్కువగా ఖర్చుపెడతాయన్న నిజం అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధనలో తేలింది. ఇంటి ఆదాయంలో పది శాతం కన్నా తక్కువ ఆదాయాన్ని తిండిపై వెచ్చిస్తున్న దేశాలు ప్రపంచంలో ఎనిమిది దేశాలున్నాయని అమెరికా వ్యవసాయ విభాగం పరిశోధన తెలిపింది. వాటిలో నాలుగు యూరప్ దేశాలు కాగా, మిగిలిన నాలుగు దేశాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని పేర్కొంది. వీటిలో అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉంది. అమెరికన్లు తమ ఇంటి ఆదాయంలో సరాసరి సగటున 6.4 శాతం ఆదాయాన్ని తిండి కోసం ఖర్చు చేస్తారట. అమెరికా తర్వాత ఇంటి ఆదాయంలో 6.7 శాతం ఖర్చుతో సింగపూర్ ద్వితీయ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్(8.2 శాతం), స్విట్జర్లాండ్(8.7 శాతం), కెనడా(9.1 శాతం), ఐర్లాండ్(9.6 శాతం), ఆస్ట్రేలియా(9.8 శాతం) ఆస్ట్రియా(9.9 శాతం) లు నిలిచాయి. ఓ ఇంటికొచ్చే ఆదాయంలో సగానికి పైగా ఆదాయాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్న దేశాల్లో ఎక్కువగా పేద దేశాలే ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా నైజీరియానే తిండికోసం ఎక్కువ ఆదాయాన్ని ఖర్చుపెడుతోందని తేలింది. అక్కడి ప్రజలు తమ ఆదాయంలో 56.4 శాతం ఆదాయాన్ని తిండిపై ఖర్చు పెడుతుండగా, 46.7 శాతంతో కెన్యా, 45.6 శాతంతో కామెరూన్, 42.5 శాతంతో అల్జీరియా, 43 శాతంతో కజకిస్థాన్, 41.9 శాతంతో ఫిలిప్పీన్స్, 40.9 శాతంతో పాకిస్థాన్, 40.6 శాతంతో గౌతమాల, 40.1 శాతంతో అజర్బైజాన్ దేశాలు ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. అమెరికన్ల కన్నా నైజీరియా ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని తిండికోసం ఖర్చు పెడుతున్నారంటే వారు తిండిబోతులనో లేదా అక్కడ తిండి ధరలు ఎక్కువనో భావించరాదు. ఓ ఇంటికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం వల్లనే పేద దేశాలు బతకడం కోసం తిండికే ఎక్కువ ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. వాస్తవానికి ఓ అమెరికన్ ఏడాదికి సగటున తిండిపై 2,392 డాలర్లు ఖర్చు పెడుతుంటే నైజీరియా మనిషి సగటున 1,132 డాలర్లను ఖర్చు పెడుతున్నారు. కెన్యా పౌరుడైతే తిండిపై ఏడాదికి సగటున 543 డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో కూడా ధనవంతుడికి, పేదవాడికి మధ్యన తిండి ఖర్చు విషయంలో వ్యత్యాసం ఉంది. 20 శాతం మంది పేదవాళ్లు గత పాతికేళ్లలో ఆహారంపై తమ ఆదాయంలో 28.8 నుంచి 42.6 శాతాన్ని ఖర్చు చేయగా, అదే 20 శాతం మంది ధనవంతులు గత పాతికేళ్ల కాలానికి తమ ఆదాయంలో 6.5 నుంచి 9.2 శాతాన్నే ఆహారంపై ఖర్చు పెట్టారు.