హైదరాబాద్: ‘కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వదంతులు నమ్మవద్దు. ఈ నెలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వేరియంట్‌తో గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చేరారనే ప్రచారం పూర్తిగా ఫేక్. అనవసరంగా భయాందోళన వద్దు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ..
∙కేరళలో వ్యాప్తిలో ఉన్న జేఎన్–1 వైరస్‌తో గాందీలో ఐదుగురు చేరారనేది పూర్తిగా అబద్ధం. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. రాష్ట్రంలోనే జేఎన్–1 వేరియంట్ కేసు నమోదు కాలేదు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు, సలహాలు అందించింది. రాష్ట్ర వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా, ఇతర వైద్య ఉన్నతాధికారులు గాం«దీలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
∙గాంధీ అత్యవసర విభాగంలో గతంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పురుషులకు 30, మహిళలకు 20 మొత్తం 50 పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ పాండమిక్ ముగిసన తర్వాత ఎండ్‌మిక్‌లో ఒకటి, రెండు కేసులు నమోదు కావడం సర్వసాధారణం. ఈ నెలలో గాం«దీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
రానున్న పండగ రోజులు కీలకం..
∙రానున్న క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలు కీలకం. కోవిడ్ వంటి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్ «ధరించాలి. హ్యాండ్ శానిటైజేషన్ పాటించాలి. ఈ ఏడాది సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో శ్వాసకోశ రుగ్మతలు, ఇన్ఫెక్షన్లు, వైరల్ ఫీవర్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. నవంబర్, డిసెండర్ నెలల్లో తగ్గుముఖం పట్టాయి.
∙ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ జేఎన్–1 మొదట అమెరికాలో వెలుగుచూసింది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కేరళలో వ్యాప్తిలో ఉంది. రూపాంతరం చెందిన జేఎన్– 1 సబ్ వేరియంట్ సెల్ఫ్ లిమిటింగ్ వైరస్. దానంతట అదే తగ్గిపోతుంది. ఈ వైరస్ తీవ్రత తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు గుర్తించారు.
వీరు జాగ్రత్తగా ఉండాలి..
ఫస్ట్, సెకెండ్ వేవ్‌ల్లో వ్యాపించిన ఆల్ఫా, డెల్టా కంటే మూడో వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ త్వరితగతిన వ్యాపిస్తుంది. ఒమిక్రాన్ సబ్‌వేరియంటే జేఎన్– 1. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకే అవకాశం ఉంది. వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వైరస్ అన్ని వేవ్‌లు సమ్మర్‌లోనే ఎక్కువగా వ్యాపించాయి.
► కేరళలో జేఎన్– 1 వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు ముందు జాగ్రత్తలు పాటించాలి. తిరిగి వచి్చన తర్వాత స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ కేసులు పెరిగితే గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే మార్గదర్శకాలను అమలు చేస్తాం.
► కోవిడ్ నోడల్ కేంద్రం సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డుతోపాటు, కోవిడ్ పరీక్షలు, పీపీఈ కిట్లు, వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయి. అసత్య ప్రచారాలు నమ్మవద్దు. భయాందోళనకు గురి కావద్దు. మాస్క్ ధరించి, హ్యాండ్ శానిటైజేషన్, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment