
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన మూడేళ్లుగా సేవలు అందిస్తున్న 244 మంది కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిన క్రమంలో కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాది పొడిగించేందుకు విముఖత వ్యక్తం చేయడంతో మార్చి 31వ తేదీ వారి విధులకు చివరిరోజైంది.
రేపటి నుంచి విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఆస్పత్రి పాలన యంత్రాంగం సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యామని, కోవిడ్ వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ప్రాణాలకు తెగించి సేవలు అందించామని విధుల నుంచి తొలగించబడిన పేషెంట్ కేర్ టేకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2020లో నియామకం
కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిని మార్చి 2020లో కోవిడ్ నోడల్ సెంటర్‌గా మార్చారు. కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు అదే ఏడాది మే నెలలో ఏడాది కాలానికి కాంట్రాక్టు పద్ధతిని 244 మందిని కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 2021, 2022లో సెకండ్, థర్డ్‌వేవ్‌లు రావడంతో కాంట్రాక్టును ఎప్పటికప్పుడు పొడిగించారు. ప్రస్తుతం కరోనా వైరస్ సర్వసాధారణం కావడంతో కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్ల అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఈ ఏడాది కాంట్రాక్టు కాలపరిమితిని పొడిగించలేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధుల్లోకి వచ్చే అవసరం లేదని ఆస్పత్రి యంత్రాంగం స్పష్టం చేస్తూ టెరి్మనేషన్ ఆర్డర్స్‌ను జారీ చేసింది.
జీడీఎక్స్‌లో చేరేందుకు ససేమిరా...
కాంట్రాక్టు కాలపరిమితి పొడిగించే అవకాశం లేదని సంకేతాలు రావడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం మానవతా ధృక్పథంతో వ్యవహరించి కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్న వారితో మంతనాలు జరిపింది. నూతనంగా సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టు పొందిన జీడీఎక్స్ సంస్థలో చేరేందుకు అవకాశం కలి్పస్తామని హామీ ఇచి్చంది. వేతనాలు తక్కువనే సాకుతో కోవిడ్ పేషెంట్‌కేర్ టేకర్లు జీడీఎక్స్‌లో చేరేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఆస్పత్రి పాలనయంత్రాంగం మిన్నకుండిపోయింది.
వైద్యసేవలకు విఘాతం కలగకుండా...
వైద్యసేవలకు విఘాతం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. కాంట్రాక్టు కోవిడ్ పేషెంట్ కేర్ టేకర్ల కాలపరిమితి పొడిగించడం తన చేతిలో లేదన్నారు.
ఇది అన్యాయం
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే ఇప్పుడు మా జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని తొలగించబడిన కోవిడ్ పేషెంట్‌కేర్ టేకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి ధర్నా, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీలో ఉద్యోగం పరి్మనెంట్ అవుతుందని నమ్మించారని, ప్రాణాలకు లెక్కచేయకుండా వేలాది మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు కృషి చేశామన్నారు. ఇప్పుడు విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యారు. సేవలందిస్తు కరోనా బారినపడి ఐదుగురు పేషెంట్ కేర్ టేకర్లు మృతి చెందారని వివరించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ రాజారావును కలిసి వినతిపత్రం అందించారు. త్వరలోనే వైద్యమంత్రి హరీష్‌రావును కలిసి తమ పరిస్థితి విన్నవిస్తామని రాజేందర్, శివ, తేజ, యాదలక్ష్మీ, సాయి, మనోజ్, జంగయ్య, స్వప్న తదితరులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment