
శివనాథన్ (ఫైల్)
చెన్నై , తిరువొత్తియూరు: మానామదురైలో శిక్షణ పొందుతున్న జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. అతని మృతిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివగంగై జిల్లా మానామదురై, రైల్వే కాలనీకి చెందిన మనోహరన్ (50) ప్రధానోపాధ్యాయుడు. ఇతని కుమారుడు శివనాథన్ (23). చెన్నైలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం ఇంటి మిద్దెపై ఉన్న గదిలో శివనాథన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మిద్దెపైకి వెళ్లిన తల్లిదండరులు కుమారుడు మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది బోరున విలపించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మానామదురై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.