హైదరాబాద్: కూకట్ పల్లిలో జూనియర్ డాక్టర్ మిస్సింగ్ కేసు నమోదైంది. వివరాలు.. అపోలో అస్పత్రిలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్ననాగదుర్గారాణి బుధవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఆస్పత్రి వెళుతున్నానని బుధవారం ఉదయం ఇంట్లో నుంచి కారులో వెళ్లింది. అయితే సాయంత్రం అయినా ఇంటికి రాకపోయే సరికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబ సభ్యులు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులను ఆశ్రయించారు.
కారు డ్రైవర్ డేవిడ్ కూడా అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు అతని కుటుంబ సభ్యుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతొందని పోలీసులు తెలిపారు.