
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ రాయ్, ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రినన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. తన కుమారుడు ఎవరీకి హనిచేయని వ్యక్తి అని, ఎవరో ఉద్దేశపూర్వంగా ఈ కేసులో ఇరికించారని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తన కుమారుడిని ఇరికించాలని చూసిన వ్యక్తి.. కఠినంగా శిక్షించబడతాడని తెలిపారు.
‘‘నేను నా కుమారుడి పట్ల ఇంకా కఠినంగా ఇప్పడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సంజయ్ తండ్రి చాలా కఠినంగా ఉండేవారు. నా భర్త మరణంతో మా కుటుంబం ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. ఈ ఘటనలో నా కుమారుడిని ఎవరు ప్రభావితం చేశారో నాకు తెలియదు. కానీ సంజయ్ రాయ్‌ని ఈ కేసులో ఇరికించాలని చూసిన వ్యక్తి ఎవరైనా శిక్షించబడతారు. సంజయ్ రాయ్ క్రీడలపై ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తి. బాక్సింగ్ నేర్చుకునేవాడు. అతను నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో ఉన్నాడు.
చదువుపరంగా కూడా స్కూల్ టాపర్‌గా నిలిచాడు. నన్ను బాగా చూసుకునేవాడు. నాకు వంట కూడా చేసిపెట్టేవాడు. కావాలంటే సంజయ ఎలాంటివాడో మా ఇంటిపక్కవాళ్లను కూడా అడిగి తెలుసుకోవచ్చు. సంజయ్ ఇప్పటివరకు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను నా కుమారుడిని కలిస్తే.. బాబు ఇలా ఎందుకు చేశావని అడుగుతాను. కానీ నా కుమారుడు ఏ తప్పూ చేయడు’’ అని అన్నారు.
తన కుమారుడు ఆర్జీ కర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నట్లు తెలియదన్నారు. అయితే ఘటన జరిగిన రాత్రి మాత్రం సంజయ్ రాయ్ భోజనం చేయలేదన్నారు. తన కుమారుడు రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లేవాడని వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. సంజయ్ మొదటి భార్య క్యాన్సర్‌లో మరణించటంతో మద్యానికి బానిస అయ్యాడని ఆయన తల్లి తెలిపారు.
ఈ ఘటన జరిగిన రాత్రి సంజయ్.. సోనాగచి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లాడని, మద్యం కూడా సేవించాడని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో చాలా మంది ప్రమేయం ఉందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సంజయ్ రాయ్ ఒక్కడిని మాత్రం బలిపశువు చేస్తున్నారని మమత ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment