కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్‌వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. డాక్లర్లు, వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. మరోవైపు.. డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలో సీఎం మమత చేసి వ్యాఖ్యాలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఘటన ఆమె చేసి వ్యాఖ్యలు సరైనవి కాదని.. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘‘మేము ఎప్పుడూ మా కూతురుతో దుర్గా పూజ జరుపుకునేవాళ్లం. రాబోయే రోజుల్లో మేము దుర్గా పూజనే కాదు మరే ఇతర పండలు జరుపుకోలేము. సున్నితమైన అంశంపై ఆమె(మమతను ఉద్దేశించి) అలా ఎలా మాట్లాడతారు?. మా కూతురిని తిరిగి తీసుకురాగలరా. సీఎం మమత కుటుంబంలో ఇలాంటి దారుణ ఘటన ఆమె ఇలాగే మాట్లాడేవారా?
నా బిడ్డకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం మమత అడ్డుకోవాలని చూస్తున్నారు. మా కూతురి మరణంతో మా ఇంట్లో దీపం వెళ్లిపోయింది. మా కూతురిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం డిమాండ్‌ను చేస్తున్నవారిని కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మమత మాట్లాడుతూ.. ‘‘ నిరసన చేస్తున్న ప్రజలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దుర్గా ఉత్సవాలపై దృష్టి సారించండి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో దుమారం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment