ఆ హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ .. | kinjarapu acham naidu inaugurates office at velagapudi | Sakshi
Sakshi News home page

ఆ హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ..

Published Sun, Oct 16 2016 9:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:25 PM

kinjarapu acham naidu inaugurates office at velagapudi

అమరావతి: నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కానీ ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిరుద్యోగ భృతికి బదులు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు.


ఆదివారం వెగలపూడిలోని సచివాలయంలో నాలుగో బ్లాక్లో అచ్చెన్నాయుడు తన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... స్వరాష్ట్రం నుంచి పరిపాలన సాగించడం సంతోషంగా ఉందన్నారు. కార్మిక శాఖను కార్మిక సంక్షేమ శాఖగా మార్చామని తెలిపారు. చంద్రన్న బీమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement