అమరావతి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వెలగపూడిలో సందడి నెలకొంది. నేటి మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ ప్రారంభించనున్నారు. తొలుత మూడు శాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులోభాగంగా పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలు తరలించారు. ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే.