attack on journalist
-
మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇంత నీచానికి దిగజారతారా జర్నలిస్టుల సంఘం ఫైర్
-
మోహన్‌బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్‌తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్‌బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్‌కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్‌తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్‌రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్‌బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్‌కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్‌ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్‌బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్‌బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు కోర్టు నోటీసులు
బాలీవుడ్ ‘భాయిజాన్’, కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన పేరు సినిమాలో కంటే కూడా హీరోయిన్స్‌తో సల్మాన్ ఎఫైర్స్ అంటూ ఎక్కువగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే కృష్ణ జింకను చంపిన కేసులో సల్మాన్‌పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు దీనితో పాటు ఓ జర్నలిస్ట్‌పై దాడి వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2019లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌కు అంధేరి కోర్టు సమన్లు జారీ చేసింది. సదరు జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు లోకల్ పోలీసులను ఈ కేసు విచారణ చెప్పట్టాల్సిందిగా కోర్డు ఆదేశించింది. ఇటీవల దీనిపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌కు ప్రతికూలంగా ఉంది. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉద్దేశిస్తూ బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆర్ఆర్ ఖాన్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు జారీ చేస్తూ సల్మాన్, ఆయన బాడీగార్డ్‌పై ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంధేరీ కోర్టు వారికి నోటిసులు జారీ చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కాగా 2019లో ముంబై రోడ్డులో సైక్లింగ్ చేస్తుండగా సల్మాన్ తన ఫోన్ లాక్కున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో మీడియా ఆయనను ఫొటోలు తీస్తున్నారని, ఈ క్రమంలో సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్ తన దగ్గరికి వచ్చి ఫోన్ లాగేసుకుని బెదరించినట్లు అశోక్ పాండే ఆరోపించాడు. -
జర్నలిస్ట్‌ల పై దాడి
-
జర్నలిస్టులపై దాడి.. పోలీసుల అదుపులో టీడీపీ కార్యకర్తలు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఉద్దండరాయనిపాలెంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో శివబాబు (వెంకటపాలెం ), నరేష్ (మోదుగుల లంకపాలెం), సురేంద్ర (వెంకటపాలెం), శ్రీనివాసరావు (వెంకటపాలెం), నాగరాజు (మోదుగుల లంకపాలెం), లోకనాయక్ (వెలగపూడి), నరసింహ స్వామి (నెక్కల్లు) ఉన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి మహిళా జర్నలిస్టు దీప్తి నల్లమోతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కొంతకాలంగా అమరావతిలో రైతుల పేరిట టీడీపీ ఆందోళనలు నిర్వహిస్తుందనే ఆరోపణలకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. చదవండి : రాజధానిలో హింసకు కుట్ర! వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి -
జర్నలిస్టులపై దాడి యాదృచ్ఛికం కాదు
సాక్షి, అమరావతి : రైతుల ముసుగులో అసాంఘిక శక్తులను రంగంలోకి దించి అమరావతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడే కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు శుక్రవారం వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటం వెనుక రైతుల ముసుగులో వచ్చిన టీడీపీ సానుభూతిపరుల హస్తం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. నిరసన కార్యక్రమాలను స్థానికులు పట్టించుకోకపోవడంతో టీడీపీ, దాని మద్దతుదారులు పనిగట్టుకుని కార్లలో జనాన్ని తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా రెచ్చగొట్టే చర్యలకు, ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడుతున్నా చూసీచూడనట్లు వదిలేశారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నినట్లు జర్నలిస్టులపై దాడి ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఖండించారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కె.రాజేశ్వరరావు ఖండించారు. మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. రైతుల ముసుగులో బయట వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. దాడుల వెనుక టీడీపీ!? సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలు ప్రశాంతంగానే కొనసాగుతున్నా.. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘కన్నా’ దీక్ష చేసిన రోజే దాడులకు ఎందుకు తెగబడ్డారు.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు కమలం పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీపై నెపం నెట్టే విధంగా టీడీపీ హింసాత్మక ఘటనలకు ఏమైనా ప్రేరేపించిందా అని వారు చర్చించుకుంటున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద కన్నా చేపట్టిన దీక్షాస్థలి సమీపంలోనే మీడియాపై మూకదాడికి పాల్పడిన వారు టీడీపీ సానుభూతిపరులే అనే వారు చెబుతున్నారు. టీడీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే ఇలాంటి ఘటనలకు ప్రణాళిక రచించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ మాస్కులతో ఎందుకు? దీనికితోడు.. ఆర్నెల్ల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా టీడీపీ నాయకులు, పెద్దలు నల్ల జెండాలు పట్టుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు మాస్కుల్లేకుండా మోదీ మాస్కులు ధరించడం దురుద్దేశంతో కూడుకున్నదేనని కూడా ఆక్షేపిస్తున్నారు. ఇది టీడీపీ పెద్దల పక్కా ప్రణాళికలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. చదవండి: వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి -
రైతుల ముసుగులో దాడులకు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి : వెలగపూడిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్ బ్రిజల్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కాగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐజి స్పష్టం చేశారు. మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడమనేది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఒక మహిళా రిపోర్టర్‌తో పాటు పలువురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే బయటవ్యక్తులు వచ్చి దాడులకు రెచ్చగొట్టారని , దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రైతుల ముసుగులో కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడికి దిగారని, ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. -
మీడియా వాహనంపై కర్రలతో దాడి
-
మహిళా జర్నలిస్టులపై దాడి
-
రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి
సాక్షి, ఉద్దండరాయునిపాలెం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఓ చానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో మీడియా ప్రతినిధిపైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మీడియా ప్రతినిధుల మీద రైతులు ముసుగులో కొందరు కావాలనే దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే.. పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
‘సాక్షి’ ప్రతినిధిపై టీడీపీ కౌన్సిలర్ కొడుకు దాడి
నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. జన్మభూమి కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ ప్రతినిధి అప్పలస్వామి నాయుడుపై టీడీపీ నాయకుడొకరు దాడికి దిగారు. వార్డు కౌన్సిలర్ బెన్నయ్యనాయుడు కొడుకు అశోక్ ‘సాక్షి’ ప్రతినిధిపై దాడి చేయడమేగాక ఫోన్ లాక్కుని దుర్భాషలాడారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కౌన్సిలర్ కుమారుడిపై నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మంత్రి అనుచరులను అరెస్టు చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సాక్షి దినపత్రిక ఆళ్లగడ్డ విలేకరి వెంకట కృష్ణయ్యపై దాడి చేసిన మంత్రి అఖిలప్రియ అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయాలని, ఈ దాడికి బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరాయి. ఆళ్లగడ్డ విలేకరిపై గురువారం మంత్రి అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు, ప్రజాసంఘాలు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో... జిల్లా కలెక్టరేట్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షుడు అంబన్న మాట్లాడుతూ మంత్రి అనుచరులను తక్షణమే అరెస్టు చేయకపోతే చలో ఆళ్లగడ్డ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ దాడికి నిరసనగా యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని 54 మండలాలు, 14 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తున్నారని, మూడున్నరేళ్లలో వందల సంఖ్యలో విలేకరులపై దాడులు జరిగినా చర్యలు శూన్యమని విమర్శించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అనుచరులు రెచ్చిపోయి విలేకరులపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్, జమ్మన్న, సుబ్రమణ్యం, హుస్సేన్, మధు, అంజి, రాము, శేఖర్, స్నేహాల్, చాంద్, మధు, రాజ్‌న్యూస్ మధు, చెన్నయ్య, యూసుఫ్, ప్రతాప్, సీవీఆర్ యాగంటి, పోలకల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ కృష్ణయ్యపై దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ చుట్టూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ..సాక్షి విలేకరిపై దాడి చేసిన మంత్రి అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వెంకటకృష్ణయ్యకు రక్షణ కల్పించి ప్రభుత్వ సొమ్ముతోనే వైద్యం అందించాలని, కుటుంబ పోషణ కోసం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృపావరం మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కాదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, మధుసుధాకర్ పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన జర్నలిస్టు సంఘాల నేతలు సాక్షి విలేకరిపై దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అంబన్న, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి, జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణతోపాలు పలువురు జర్నలిస్టు నాయకులు జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టికి ఫిర్యాదు చేశారు. ముందు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు సక్రమంగా స్పందించకపోవడంతో దాడి జరిగినట్లు వారు వివరించారు. వ్యక్తిగత కారణాలతోనే విలేకరిపై దాడి జరిగినట్లు ఆళ్లగడ్డ పోలీసులు ఎస్పీకి నివేదిక ఇవ్వడం విచాకరమని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలని కోరగా..ఎస్పీ సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుపై దాడికి ఖండన ఆళ్లగడ్డ సాక్షి విలేకరిపై దాడికి పాల్పడిన మంత్రి అఖిలప్రియ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం(ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర ప్రధాన కార్యదర్శి కే.వెంకటస్వామి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం గూడూరు: సాక్షి దిన పత్రిక ఆళ్లగడ్డ విలేకరి వెంకటకృష్ణయ్యపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపినా««థ్జట్టి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. రోజురోజుకు విలేకరులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎస్పీ నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో విలేకరులు వి.శ్రీనివాసులు, కె.శ్రీనివాసనాయుడు, జి.ఉరుకుందు, కె.ప్రభాకర్, దౌలత్‌ఖాన్, పి.లక్ష్మన్న, తదితరులున్నారు. అంతకుముందు స్టేషన్లో రికార్డులు, కేసుల వివరాలు తెలుసుకున్నారు. వెల్లువెత్తిన నిరసనలు కర్నూలు (అర్బన్) : సాక్షి ఆళ్లగడ్డ విలేకరి వెంకటకృష్ణయ్యపై దాడికి నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆదోని పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన ప్రదర్శన, ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ ఓబులేసుకు వినతి పత్రం సమర్పించారు. ఆలూరు, çహŸళగుందలో తహశీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చారు. బనగానపల్లె, కోవెలకుంట్లలో ధర్నా, ర్యాలీ నిర్వహించి..తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. కోడుమూరు, గూడూరు, సి.బెళగల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. మంత్రాలయం, కోసిగిలో నిరసన తెలిపారు. నందికొట్కూరులోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై గంట పాటు రోస్తారోకో చేపట్టారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాససెంటర్‌లో ఏపీయూడబ్ల్యూజే ,సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పత్తికొండలో వైఎస్సార్సీపీ, ఏపీయూడబ్ల్యూజే, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎమ్మిగనూరులో జరిగిన ఆందోళనలో సాక్షిబ్యూరో ఇన్చార్జ్ కేజీ రాఘవేంద్రరెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు భాస్కర్‌యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న జర్నలిస్టులపై ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష దాడులు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు పట్టణంలోని గౌడ్‌సెంటర్‌లో ఆత్మకూరు డివిజన్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డోన్ పట్టణంలో జర్నలిస్టులు ప్రదర్శన నిర్వహించి.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పాణ్యంలో విలేకరులు, జర్నలిస్టు నేతలు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?
-
ఇంతకీ 'చీరాలకు చీడపురుగు'లో ఏముంది?
ప్రకాశం జిల్లా చీరాల గడియారం సెంటర్లోని పోలీసు స్టేషన్ ఎదురుగానే ఒక పాత్రికేయుడిని ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా కర్ర పట్టుకుని చితకబాదిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ప్లానింగ్‌తో ముందుగానే ఒక దళితుడిని పోలీసు స్టేషన్‌కు పంపి, అతడితో నాగార్జునరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించి ఆ తర్వాత కొద్ది సేపటికే దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు.. ఇలా ఆమంచి సోదరులు చేస్తున్న అక్రమాలను వెలికితీసి పత్రికలలో రాయడం వల్లే ఈ దాడి జరిగిందన్నది బహిరంగ రహస్యమే అయినా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. దీనిపై తనమీద దాడి జరిగిన ప్రదేశంలోనే జర్నలిస్టు నాగార్జునరెడ్డి సోమవారం ఉదయం ధర్నా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. ఎమ్మల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు స్వయంగా తనను కొట్టాడని చెప్పారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉండటంతో.. దీనిపై పోలీసులను 'సాక్షి' ప్రశ్నించగా, పాలేటి రామారావు ఇంటివద్ద గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని, ఆ సమయంలో సరిగ్గా ఇక్కడ దాడి జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని తప్పకుండా పట్టుకుని అరెస్టు చేస్తామని చెప్పారు. స్వతంత్ర సభ్యుడిగా గెలిచి, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 'కాదేదీ దోపిడీకి అనర్హం' అన్నట్లుగా భూమి, ఇసుక, నీరు, బియ్యం, చెట్లు, ప్రజల ఆస్తులు, ప్రజాధనం దేననీ వదలకుండా దోచుకుతింటున్న గజదొంగ అని నాగార్జున రెడ్డి తాను రాసిన 'చీరాలకు చీడపురుగు' కథనంలో పేర్కొన్నారు. 'మట్టిచేతుల బాస' అనే మాసపత్రిక తాజా సంచికలో ఈ కథనం ముఖచిత్ర కథనంగా వచ్చింది. మొత్తం 14 పేజీల స్టోరీ రాశానని, అందులో ప్రతి ఒక్క విషయానికీ పూర్తి ఆధారాలు ఉన్నాయని నాగార్జునరెడ్డి చెప్పారు. దళితులు, గిరిజనుల భూములను ఆక్రమంచి, వాటికి అధికారబలంతో పట్టాదారు పాస్ పుస్తకాలు సంపాదిస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో రెవెన్యూ రికార్డులు సృష్టిస్తున్నారని కూడా అందులో రాశారు. ప్రశ్నించేవారిపై అక్రమకేసులు బనాయిస్తారని, అడ్డుగా వస్తున్నారనుకున్నవారి ఆస్తులను ధ్వంసం చేసి భయానక పరిస్థితులు సృష్టించి తన పబ్బం గడుపుకొంటారని పేర్కొన్నారు. మచ్చుకి కొన్ని అంశాలు పరిశీలిద్దాం అంటూ.. సుదీర్ఘంగా అక్రమాల చిట్టాను బయటపెట్టారు. దాంతో ఆయనపై దాడి జరిగింది. -
'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత
ప్రకాశం : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆమంచి అరాచకాలపై వార్త రాసినందుకు జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేశాడు. ఆ దాడి దృశ్యాలను ప్రసారం చేసిన 'సాక్షి' చానల్‌పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారు. (చదవండి : ఆమంచి ఆటవిక రాజ్యం.. ) చీరాలలో సాక్షి ప్రసారాలను సోమవారం ఎమ్మెల్యే ఆమంచి నిలిపి వేయించారు. ఎమ్మెల్యే తీరుపై జర్నలిస్ట్ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 500 మంది ఆమంచి బాధితులతో కలిసి సీఎం చంద్రబాబుకు గతంలోనే ఫిర్యాదు చేశానని బాధిత జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి తెలిపారు. అయినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. నాగార్జునరెడ్డికి పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. -
జర్నలిస్టుపై దాడి.. ఎంపీ అసద్‌పై కేసు
యాకుత్‌పురా: సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సియాసత్ విలేకరి ముబాషీర్(35) మంగళవారం చెత్తబజార్ నుంచి వెళుతున్నాడు. విధి నిర్వహణలో ఉన్న ముబాషీర్ తనకు ఎదురుపడటంతో ఎంపీ అసదుద్దీన్, ఆయన అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. ముబాషీర్‌పై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 341, 323, 504, 506, ఆర్/డబ్ల్యూ-34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో అసదుద్దీన్, ఆబేద్‌తోపాటు పలువురు ఆయన అనుచరుల పేర్లు పేర్కొన్నాడు.