యాకుత్‌పురా: సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరిపై దాడికి పాల్పడిన ఘటనలో మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సియాసత్ విలేకరి ముబాషీర్(35) మంగళవారం చెత్తబజార్ నుంచి వెళుతున్నాడు.
విధి నిర్వహణలో ఉన్న ముబాషీర్ తనకు ఎదురుపడటంతో ఎంపీ అసదుద్దీన్, ఆయన అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. ముబాషీర్‌పై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 341, 323, 504, 506, ఆర్/డబ్ల్యూ-34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో అసదుద్దీన్, ఆబేద్‌తోపాటు పలువురు ఆయన అనుచరుల పేర్లు పేర్కొన్నాడు.
జర్నలిస్టుపై దాడి.. ఎంపీ అసద్‌పై కేసు
Published Tue, Feb 2 2016 10:25 PM | Last Updated on Thu, Aug 9 2018 5:00 PM
Advertisement
Advertisement