
మజ్లిస్‌తోనే పాతబస్తీ అభివృద్ధి: అసదుద్దీన్ ఒవైసీ
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ఎంఐఎం ఒక్కటేనని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పుగూడ డివిజన్‌లో ఆయన ఎంఐఎం అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పాతబస్తీ అభివృద్ధి మజ్లీస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు.
ఉప్పుగూడ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్ హయాంలో కమ్యూనిటీ హాళ్లు, రహదారులు, నాలా విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్, నాయకులు మహ్మద్ జలీల్, మహ్మద్ షపియుద్దీన్, ఇబ్రహీం సర్దార్, ఖైసర్, మజ్హర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
బార్కాస్‌లో ప్రచారం
బార్కాస్ డివిజన్ నూరీనగర్, అహ్మద్ నగర్‌లలో మజ్లీస్ శాసనసభ పక్షనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. బార్కాస్ ఎంఐఎం అభ్యర్థి షభానా బేగంతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బార్కాస్ మాజీ కార్పొరేటర్ మన్సూర్ అవల్కీ, నాయకులు సాల్హే బాహమాద్ తదితరులు పాల్గొన్నారు.
లలితాబాగ్‌లో..
లలితాబాగ్ డివిజన్ ఫతేషానగర్‌లో డివిజన్ ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అలీ షరీఫ్(ఆజం) తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మజ్లీస్ నాయకులు మహ్మద్ రియాజ్, మహ్మద్ మహమూద్, మహ్మద్ అష్ఫాక్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.