'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత | Sakshi channel stopped in chirala by mla amanchi krishna mohan | Sakshi
Sakshi News home page

'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత

Published Mon, Feb 6 2017 11:04 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత - Sakshi

'ఆమంచి' ఆగడాలు : సాక్షి ప్రసారాల నిలిపివేత

ప్రకాశం : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆమంచి అరాచకాలపై వార్త రాసినందుకు జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి చేశాడు. ఆ దాడి దృశ్యాలను ప్రసారం చేసిన 'సాక్షి' చానల్‌పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారు.

(చదవండి : ఆమంచి ఆటవిక రాజ్యం.. )

చీరాలలో సాక్షి ప్రసారాలను సోమవారం ఎమ్మెల్యే ఆమంచి నిలిపి వేయించారు. ఎమ్మెల్యే తీరుపై జర్నలిస్ట్‌ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 500 మంది ఆమంచి బాధితులతో కలిసి సీఎం చంద్రబాబుకు గతంలోనే ఫిర్యాదు చేశానని బాధిత జర్నలిస్ట్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. అయినా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. నాగార్జునరెడ్డికి పలువురు జర్నలిస్ట్‌ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement