ప్రకాశం జిల్లా చీరాల గడియారం సెంటర్‌లోని పోలీసు స్టేషన్ ఎదురుగానే ఒక పాత్రికేయుడిని ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా కర్ర పట్టుకుని చితకబాదిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పక్కా ప్లానింగ్‌తో ముందుగానే ఒక దళితుడిని పోలీసు స్టేషన్‌కు పంపి, అతడితో నాగార్జునరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టించి ఆ తర్వాత కొద్ది సేపటికే దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు.. ఇలా ఆమంచి సోదరులు చేస్తున్న అక్రమాలను వెలికితీసి పత్రికలలో రాయడం వల్లే ఈ దాడి జరిగిందన్నది బహిరంగ రహస్యమే అయినా పోలీసులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు.