YCP Leader Nandigam Suresh Serious Comments On Chandrababu Naidu And TDP - Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ: నందిగాం సురేష్‌

Published Wed, Jun 14 2023 5:53 PM | Last Updated on Wed, Jun 14 2023 7:09 PM

Nandigam Suresh Serious Comments Over Chandrababu And TDP - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు కంటే నారా లోకేశ్‌ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ హైదరాబాద్‌ పారిపోతారు. పవన్‌ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాలు తీసుకోవాల్సిందేనని ఎంపీ నందిగాం సురేష్‌ ఎద్దేవా చేశారు. 

కాగా, నందిగాం సురేష్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడో చెప్పాలి. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా?. మాదిక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు.. మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చాడా?. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని మేలు ఏపీలో దళితులకు జరిగింది. చంద్రబాబు దగ్గర కొందరు నేతలు బానిసలుగా ఉన్నారు. ఎస్సీలను రాజధానిలో చంద్రబాబు దొంగలుగా చిత్రీకించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తానని అవమానించింది చంద్రబాబు కాదా?. ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించలేదా?. 

సీఎం జగన్‌ ఎస్సీలను నా తమ్ముళ్లు, అన్నలు, కుటుంబ సభ్యులు అని భావిస్తారు. రెండెకరాల చంద్రబాబుకి ఇన్ని వేల ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలి?. ఎన్నికలొచ్చాయంటే చాలు కులాల మధ్య కుంపటి పెట్టడం చంద్రబాబుకి అలవాటు. 98 శాతం హామీలు అమలు చేశాం కాబట్టే 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్నాం. అంటరానితనాన్ని పోషిస్తోంది తెలుగుదేశం పార్టీనే. టీడీపీ ప్రజలకు అంటరాని పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: అమిత్‌ షా వ్యాఖ్యలపై సజ్జల ఏమన్నారంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement