
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని తిట్టిన చంద్రబాబు మళ్లీ బీజేపీ నేతల గుమ్మం దగ్గర నిలబడడం సిగ్గు చేటు అని వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మండ్డిపడ్డారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. తన మీద తనకు నమ్మకం లేక పొత్తుల కోసం తాపత్రయపడుతున్నారు.
..పవన్ కల్యాణ్ దమ్ము చాలదని, బీజేపీ కాళ్లా వెళ్ళా పడుతున్నాడు. చంద్రబాబు 14 ఏళ్ళల్లో దోచుకున్నాడు. తన జీవితంలో చంద్రబాబు ఏనాడూ సొంతంగా పోటీ చేసి గెలవలేదు. ఒక్కడుగా ఎదుర్కొనే ధైర్యం లేక.. పవన్, బీజేపీ, కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టాడు. భయంతో చంద్రబాబు రేపు కేఏ.పాల్‌తో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు జిమ్మిక్కులతో సర్వేలు చేయించాడు’ అని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు.
తన పాలనలో మంచి జరిగితేనే ఓటు వేయాలని అడిగే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. పేదల ఖాతాల్లో ఉందని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు.
చదవండి: నేరుగా వెళ్లి పులిబోనులో పడ్డట్లుగా.. జనసేన రాజకీయ వైనం!
Comments
Please login to add a commentAdd a comment