గుంటూరు, సాక్షి: తన భర్తకు ఏమైనా హాని జరిగితే దానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మాజీ వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగామ సురేష్ భార్య బేబీలతా అన్నారు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి చంద్రబాబు నాయుడు నందిగామ సురేష్ టార్గెట్ చేశారని తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘నందిగామ సురేష్‌పై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయపోరాటం చేస్తున్నాం. విజయవాడలో వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైంది.విజయవాడ వరద వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి నందిగాం సురేష్‌ను అరెస్టు చేయడానికి రెడీ అయ్యారు. కోర్టులో జడ్జీ ఆదేశాలు ఇవ్వక ముందే పోలీసులు మా ఇంటిపైన వచ్చిపడ్డారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment