
(ఫైల్ ఫొటో)
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఒక సైనికుడిగా పనిచేయడమే తనకు ముఖ్యమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన కృష్ణాజిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి పాల్గొన్నారు.మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కొడాలి నానికి.. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఐతే ఈ సందర్భంగా తనను పార్టీ నాయకులు, శ్రేణులు మాజీ మంత్రి అని పిలవడంపై కొడాలి తన దైన శైలిలో స్పందించారు.
తనను ఎవరూ మాజీ మంత్రి అని పిలవొద్దని కొడాలి నాని కోరారు. గుడివాడ ఎమ్మెల్యేగానే తాను ఉండటానికి ఇష్టపడతానని మంత్రి పదవి పోతే బాధపడనని తెలిపారు. కానీ ఎమ్మెల్యే పదవి పోతేనే బాధ పడతానని స్పష్టం చేశారు. తానేమీ చంద్రబాబు లాంటి వ్యక్తిని కానని.. బాబు లాంటి వారే పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారంటూ తీవ్రంగా విమర్శించారు.
చదవండి: పోలవరం డయాఫ్రమ్ వాల్ నష్టం ఎవరి పాపం?: అంబటి
ఏపీ శ్రీలంక అవుతుందని 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. దేవుడు లాంటి వైఎస్సార్‌ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని గుర్తుచేశారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తాని స్పష్టం చేశారు.
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..
చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తెల్ల మొఖం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నాడన్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment