సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు తొత్తులుగామారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న కొందరు నాయకుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని, వారంతా జై చంద్రబాబు అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హర్ష కుమార్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశం దళిత జాతి కోసం కాదు చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దారుణాలపై హర్ష కుమార్, శ్రవణ్ కుమార్‌ను ఎందుకు స్పందించలేదని చెప్పారు. అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మంత్రి హోదాలో ఆదినారాయణరెడ్డి దళితులను అవమానిస్తే మీరు ఎక్కడున్నారు. నీకెందుకురా రాజకీయాలు అని చింతమనేని దళితుల్ని దూషించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా... అన్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబూ లాంటి నీచులు 100 మంది వచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు.
(చదవండి: చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ)
హర్షకుమార్ టీడీపీలో చేరడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. చంద్రబాబు రాసిన స్క్రిప్టు కాకుండా మీకంటూ సొంతగా స్క్రిప్టు రాసుకునే దమ్ముందా. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేముంటే చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అడ్డుకున్నాడో అడగండి. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీయండి. దళిత జాతిని మీరు బాగుపడనివ్వరా? చంద్రబాబుకు, లోకేష్‌కు ధైర్యం ఉంటే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం కాదు, ఏపీకి రమ్మనండి. మంగళగిరి దెబ్బకి లోకేష్ హైదరాబాద్ పారిపోయాడు. వెన్నుపోటు అని గూగుల్‌లో కొడితే చంద్రబాబు పేరు వస్తుంది. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చించుకుందాం రండి. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం’అని ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు.
(చదవండి: పోలీసు సంస్కరణల్లో ‘ఆంధ్ర’ భేష్)
Comments
Please login to add a commentAdd a comment