సాక్షి, కృష్ణా: 2019లో చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని..మీ సమావేశాల్లొ ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ.. కానీ బాబుకు నిలువెళ్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథక కూడా గుర్తుకు రాదని అన్నారు.
చంద్రబాబు సవాల్‌కుపేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందరు పోర్టును పూర్తిచేశావా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్.. మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్‌ను చేస్తానన్నావ్ చేశావా?. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు.
ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. సీఎం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment