![Perni Nani Counter To Chandrababu comments On Cm Jagan - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/8/perni-nani.jpg.webp?itok=prjwusKH)
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని మండిపడ్డారు. తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం చెప్పుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి , తండ్రి చనిపోతే తలకొరివి పెట్టలేని వాడు.. నేటికీ రామారావు అల్లుడినని చెప్పుకుంటాడని చంద్రబాబుపై మండిపడ్డారు పేర్ని నాని. నేను ఫలానా వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరమని అన్నారు. పొలాల్లో తాడిచెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసొస్తుందన్న ఆయన.. 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైఎస్సార్‌సీపీ జెండాను కూడా టచ్ చేయలేడని పేర్నినాని అన్నారు. చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసని, అధికారంలో రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని.. అధికారంలోకి వచ్చాక ఎలా నేల నాకిస్తాడో అందరికీ తెలుసని తెలిపారు.. 80 ఏళ్ల ముసలినక్క చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
చదవండి: చంద్రబాబు ఐటీ స్కామ్.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్!
Comments
Please login to add a commentAdd a comment