సాక్షి, విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలన్నారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలని చురకలు అంటించారు.
'ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా? హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ఈనాడులో ప్రచారం చేయించాడు. హరికృష్ణకి పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని వదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని రమ్మంటున్నాడు’’ అని కొడాలి నాని దుయ్యబట్టారు.
‘‘వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడం ఏంటి?. టీడీపీలో మహానాడు పెట్టి ఎన్టీఆర్, లోకేష్‌లకు వారసుడు కోసం ఓటింగ్ పెట్టండి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది.' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
చదవండి: చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్?
Comments
Please login to add a commentAdd a comment