
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీకి తప్ప రాజకీయాలకు పనిచేయడని మంత్రి రోజా విమర్శించారు. పవన్ .. నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అని ధ్వజమెత్తారు. బాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా? కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు ఇరుకు రోడ్డుల్లో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నారని రోజా మండిపడ్డారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని మంత్రి గుర్తు చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 మందిని చంపాడని అన్నారు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా? లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని మాకులేదు. లోకేష్ సన్నబడ్డం కోసమే పాదయాత్ర చేపట్టారు. ఆయన పాదయాత్ర చేస్తే ఆ పార్టీకే నష్టం. లోకేష్ పాదయాత్రకు టీడీపీనే భయపడుతోంది’ అని మంత్రి రోజా సెటైర్లు వేశారు.
చదవండి: పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్