సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
పిల్లలు కొడతారనే భయంతోనే లోకేశ్ జూమ్‌లో మాట్లాడారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తాను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెబితే బాగుండేదన్నారు.
కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశాలని గొడవ చేసింది ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు తెరిస్తే.. కరోనా సమయంలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని స్కూల్స్‌ను మూసివేయాలని ఆందోళనలు చేసింది టీడీపీ వాళ్లే కదా అని గుర్తు చేశారు.
చదవండి: Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్
Comments
Please login to add a commentAdd a comment