
సాక్షి, నెల్లూరు: కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. టీడీపీ స్థాయి దిగజారిందని.. కుప్పంలో విజయం సాధించడానికి లోకేష్ ఐదువేలు పంచటం సిగ్గుచేటని విమర్శించారు. సొంత నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేని బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు.
కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలలో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందని మంత్రి బాలినేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment