సాక్షి, హైదరాబాద్: టీడీపీ పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికిపోతురాజు. సీనియర్లందరూ చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలపీఠం ఎక్కిస్తున్నాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (‘లోకేశ్ ఆవేదన తాలూకు ఉద్రేకం’)
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన దక్షతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘పాలన ఎప్పుడు ‘సిటిజెన్ సెంట్రిక్‘ గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీ హర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి’ అని పేర్కొన్నారు. (‘ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’)
‘కరోనా నియంత్రణతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో నిల్చింది. 108,104 అంబులెన్సులు ప్రాణం పోసుకున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లు కార్పోరేట్ సంస్థలతో పోటీ పడేలా జగన్ గారు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది’ అంటూ మరో ట్వీట్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/bXQOz2BBco
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020
కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020
పాలన ఎప్పుడు ‘సిటిజెన్ సెంట్రిక్‘ గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్ గారు సిఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీహర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020
Comments
Please login to add a commentAdd a comment