
పోలవరం ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్ పోలవరం. పోలవరం పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకే చంద్రబాబు లేఖ రాశారు. షెకావత్‌కు చంద్రబాబు రాసిన లేఖ చెత్తబుట్టకు చేరుతుంది. చంద్రబాబు రాసిన లేఖ కుట్రపూరితమైన లేఖ. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
చదవండి: ‘ఇదేమన్నా రామోజీరావు చిట్‌ఫండ్ కంపెనీనా?’