సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు ముందు పలు కీలక విషయాలు ప్రస్తావించారు.
రాఘురామకృష్ణం రాజు చట్టం గురించి తెలియని అమాయకుడేమీ కాదని.. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని అన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌పై వ్యాఖ్యలు చేయడం కూడా తెలుసని, కావాలనే వాస్తవాలను తొక్కిపెట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని తెలిపారు. ఆయన దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ పిటిషన్ వెనక రఘురామరాజుకు వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. విష ప్రచారంలో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. కేసుల గురించి చెప్పలేదని, స్పీకరిచ్చిన ఫిర్యాదు ప్రస్తావన లేదని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో ధిక్కార చర్యల గురించి పేర్కొనలేదని తెలిప
పైపెచ్చూ ఎలాంటి కేసులు లేవని పిల్లో డిక్లరేషన్ ఇచ్చారని, అన్నీ దాచిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొన్నారు. కోర్టుకొచ్చిన వ్యక్తి సదుద్దేశంతో వచ్చారో లేదో చూడాలని, సీఎం గురించి ఆయన ఏం మాట్లాడారో ఓసారి చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు అడ్వొకేట్ జనరల్. దీనిపై స్పందించిన కోర్టు.. రఘురామకృష్ణంరాజు మాట్లాడిన మాటల వీడియోలను పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment