
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నేత రఘురామ కృష్ణంరాజు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలుతో పాటు పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. తాజాగా రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment