
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: ఓటీఎస్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితం: సజ్జల
‘‘ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టే.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment