సాక్షి, న్యూఢిల్లీ : జల వివాదాల కమిటీ ఏర్పాటుకు మద్దతిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. అయితే దానికి నేతృత్వం వహించే వారు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండాలని, జల వివాదాల సమస్య పరిష్కారానికి ఏడాదిన్నర సమయం తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని కోరారు. బుధవారం లోక్‌సభలో అంతర్ రాష్ట్ర జల వివాదాల బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యం చేయడం వల్ల అసలు ఉద్దేశం నెరవేరదని అభిప్రాయపడ్డారు. సరైన డేటా ఉంటే సమస్యను పరిష్కరించడం చాలా సులువని, సమస్య పరిష్కారం అంతా ఆరు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దిగువ రాష్ట్రాల్లో ప్రయోజనాలను కాపాడాలని, ప్రభావవంతమైన నీటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment