
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రై. లిమిటెడ్‌కు సంబంధించి రూ.826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ లేఖపై మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు. pic.twitter.com/Tc6o5N7C5J
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 8, 2021
Comments
Please login to add a commentAdd a comment