
'జగన్ ఆదేశాలమేరకే సుప్రీం కోర్టులో పిటిషన్'
ఢిల్లీ: తమ నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకే తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్‌ఆర్ సీపీ నేత రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లులో అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధమైనవని తెలిపారు.
రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)లో మార్పులు చేయాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలని చెప్పారు. పోలవరం డిజైన్‌ను మార్చడం అప్రజాస్వామికం అన్నారు.