State bifurcation
-
మురిపించి.. విదిల్చారు!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ, అందులోనూ అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో ఇలాగే వ్యవహరించారుు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజానీకం ముక్తకంఠంతో గగ్గోలు పెట్టింది. ఇందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఓ ఓదార్పు ప్రకటన చేసింది. నవాంధ్రప్రదేశ్లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. అయితే.. 2014 ఎన్నికల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసిన యూపీఏ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఎవరు అధికారంలోకి వచ్చినా పార్లమెంట్లో చేసిన ప్రకటనను మాత్రం మరచిపోకూడదు. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పేర్కొన్న విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరుతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.350 కోట్ల నిధులను ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీకి మంగళం పాడి...ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధికి ప్యాకేజీ పేరుతో చిల్లర విదిల్చింది. అనంతపురం వాటా రూ.50 కోట్లు ‘సీమ’లోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కలిపి రూ.350 కోట్లు ఇచ్చింది. అంటే జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదలవుతాయి. జిల్లాలో కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలు, తాగు, సాగు నీటి అవసరాలతో పాటు పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేలా కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటిస్తుందని ‘అనంత’ వాసులు ఆశ పడ్డారు. ఆ ఆశలన్నీ అడియూసలే అయ్యూరుు. అదే బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించివుంటే ఒక్కో జిల్లాకు రూ.500-600 కోట్లు వచ్చేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. వి. సమస్యలు బోలెడు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం అనేది అందరికీ తెలిసిన సత్యం. జిల్లాలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయూల్సి ఉంది. హంద్రీ-నీవా పథకం జిల్లా వరకూ పూర్తి కావాలన్నా రూ.వంద కోట్లు కావాలి. మొదటిదశ పనులు పూర్తి కావాలంటే రూ.400 కోట్లు అవసరం. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే రూ.1500 కోట్లు విడుదల చేయూలి. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయూల కల్పనలోనూ జిల్లా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో భారీ ప్యాకేజీ ఇచ్చి ‘అనంత’ను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై ‘అనంత’ వాసులు మండిపడుతున్నారు. ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కేంద్రంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. అయినా ప్రత్యేక ప్యాకేజీ రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లా ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరూ టీడీపీ వారే. ఉత్తరాంధ్రకు చెందిన అశోక్‌గజపతి రాజుతో పాటు సుజనాచౌదరి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరందరూ ప్రత్యేక ప్యాకేజీ సాధనలో విఫలమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో జిల్లాకు విదిల్చిన రూ.50 కోట్లు మినహా ఇక ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏమీ ఉండదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జిల్లాలో అధికారపార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఏమి చేస్తారో వేచిచూడాలి! -
మరింత దూరం
సాక్షి, గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవటంతో పార్టీలో ఉన్నతస్థాయి పదవులు అనుభవించిన ముఖ్య నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గెలిచే అవకాశాలు లేవని భావించిన కొందరు నేతలు టికెట్లు వచ్చినా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో చెందిన ద్వితీయ స్థాయి నేతలు పోటీలో నిలిచారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీసీసీ సమీక్ష సమావేశానికి సైతం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, గాదె వెంకటరెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు గైర్హాజరయ్యారు. వీరిలో గాదె వెంకటరెడ్డి ఎన్నికల ముందు నుంచి పార్టీకి దూరంగా ఉంటుండగా, పనబాక, నాదెండ్ల మాత్రం పార్టీ విధేయులుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి తొలి సమీక్ష సమావేశానికి వీరిరువురూ హాజరు కాకపోవడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి హాజరైనా మధ్యలోనే వె ళ్లిపోయారు. ముఖ్య నేతల తీరుపై ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మండిపడుతున్నారు. పదవులు అనుభవించి పోటీలో నిలవకుండా ఎన్నికల్లో తమను పావులుగా వాడుకుని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా చలామణి కావాలని చూస్తున్నారని కొందరు నేతలు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తమకే అప్పగించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో ధైర్యంగా నిలబడిన వారికి పార్టీ అండగా ఉంటుందని, అధిష్టానం తగు న్యాయం చేస్తుందని రఘువీరారెడ్డి వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. టిక్కెట్లు ఇచ్చినా పోటీకి తిరస్కరించిన నేతలపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల అనంతరం అధిష్టాన పెద్దలను కలిసేందుకు వెళ్లిన వీరికి అపాయింట్మెంట్లు దక్కకపోవడం గమనార్హం. -
వెబ్సైట్లో విభజన కమిటీల నివేదికలు
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఏర్పాటు చేసిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్సైట్లో ఉంచుతున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెప్పారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ రోజు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం జైరాం రమేష్ మాట్లాడుతూ మే 9న మరోసారి సమావేశమై విభజన ప్రక్రియను సమీక్షిస్తామని చెప్పారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో విభజన అంశాల అమలుకు మరో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విభజనకు సంబంధించిన కీలక సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. -
కార్యాలయాలన్నీ 1/2
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయంతోపాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఒన్ బై టు కాబోతున్నాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాద్ నగరం గరిష్టంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. దాంతో దాదాపు అన్ని కార్యాలయాలను సగం సగంగా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించే పనులు చెకచెకా జరుగుతున్నాయి. సచివాలయంలోని బ్లాక్‌లను కూడా అదేవిధంగా విడగొడుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ సిఎంకు, హెచ్ బ్లాక్‌ను సీమాంధ్ర సీఎంకు కేటాయిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖకు చెందిన కీలక కార్యాలయాలన్నీ వన్ బై టూగా పంచుకోవాలని నిర్ణయించారు. ఉన్నతస్థాయి కమిటీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. తక్షణం ఆయా కార్యాలయాలకు డెరైక్టరీలు రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. దీంతో పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త కార్యాలయాలకు డోర్ నెంబర్లు, ఫోన్ నెంబర్ల కోసం వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదంతా మూడు రోజులలో అయ్యే పనేనా? పోలీసు విభాగం ఇరు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, సీఐ సెల్ వంటివి ఒకే ప్రాంగణంలో ఉంచాలని నిర్ణయించారు. ‘విడిపోయీ కలిసుందాం’ అనే నినాదంతో వారు ముందుకు వెళ్తున్నారు. -
జూన్ 2 నుంచి రెండురాష్ట్రాలకు వేరువేరు బడ్జెట్లు
హైదరాబాద్: జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెట్లు సమర్పించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు (జిఓ 74) విడుదల చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరానికి 2 నెలలకే బడ్జెట్ విడుదల చేశారు. ఏప్రిల్, మే నెలలకు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి బడ్జెట్ మే 25 వరకే వర్తిస్తుంది. -
ఏప్రిల్ 30 నాటికి విభజన ప్రక్రియ పూర్తి: గవర్నర్ ఆదేశం
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఉన్నతాధికారులతో ఈరోజు గవర్నర్ సమీక్షించారు. శాసనసభ, శాసన మండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కేటాయింపునకు సంబంధించి స్పీకర్, చైర్మన్లతో చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశం పారదర్శికంగా ఉండాలన్నారు. అవసరమైతే స్వయంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. విభజన వల్ల తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. జంట నగరాల్లో అక్రమ నీటి సరఫరా విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దానికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామల్లో తాగునీటి కొరతలేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసినా......లగడపాటి రాజగోపాల్ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. -
'జగన్ ఆదేశాలమేరకే సుప్రీం కోర్టులో పిటిషన్'
ఢిల్లీ: తమ నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకే తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ సీపీ నేత రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లులో అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధమైనవని తెలిపారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)లో మార్పులు చేయాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలని చెప్పారు. పోలవరం డిజైన్‌ను మార్చడం అప్రజాస్వామికం అన్నారు.