కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమ, అందులోనూ అనంతపురం జిల్లా అభివృద్ధి విషయంలో ఇలాగే వ్యవహరించారుు. రాష్ట్ర విభజన సమయంలో అన్ని ప్రాంతాల కంటే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజానీకం ముక్తకంఠంతో గగ్గోలు పెట్టింది. ఇందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఓ ఓదార్పు ప్రకటన చేసింది. నవాంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. అయితే.. 2014 ఎన్నికల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసిన యూపీఏ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఎవరు అధికారంలోకి వచ్చినా పార్లమెంట్‌లో చేసిన ప్రకటనను మాత్రం మరచిపోకూడదు. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పేర్కొన్న విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పేరుతో రాయలసీమ, ఉత్తరాంధ్రకు రూ.350 కోట్ల నిధులను ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీకి మంగళం పాడి...ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధికి ప్యాకేజీ పేరుతో చిల్లర విదిల్చింది.
అనంతపురం వాటా రూ.50 కోట్లు
‘సీమ’లోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కలిపి రూ.350 కోట్లు ఇచ్చింది. అంటే జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదలవుతాయి. జిల్లాలో కొన్నేళ్లుగా నెలకొన్న సమస్యలు, తాగు, సాగు నీటి అవసరాలతో పాటు పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేలా కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటిస్తుందని ‘అనంత’ వాసులు ఆశ పడ్డారు. ఆ ఆశలన్నీ అడియూసలే అయ్యూరుు. అదే బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ప్రకటించివుంటే ఒక్కో జిల్లాకు రూ.500-600 కోట్లు వచ్చేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. వి.
సమస్యలు బోలెడు
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం అనేది అందరికీ తెలిసిన సత్యం. జిల్లాలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయూల్సి ఉంది. హంద్రీ-నీవా పథకం జిల్లా వరకూ పూర్తి కావాలన్నా రూ.వంద కోట్లు కావాలి. మొదటిదశ పనులు పూర్తి కావాలంటే రూ.400 కోట్లు అవసరం. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే రూ.1500 కోట్లు విడుదల చేయూలి. శ్రీరామరెడ్డి, జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయూల కల్పనలోనూ జిల్లా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో భారీ ప్యాకేజీ ఇచ్చి ‘అనంత’ను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై ‘అనంత’ వాసులు మండిపడుతున్నారు.
ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
కేంద్రంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా కొనసాగుతోంది. అయినా ప్రత్యేక ప్యాకేజీ రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లా ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్‌రెడ్డి ఇద్దరూ టీడీపీ వారే. ఉత్తరాంధ్రకు చెందిన అశోక్‌గజపతి రాజుతో పాటు సుజనాచౌదరి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరందరూ ప్రత్యేక ప్యాకేజీ సాధనలో విఫలమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో జిల్లాకు విదిల్చిన రూ.50 కోట్లు మినహా ఇక ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏమీ ఉండదని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జిల్లాలో అధికారపార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఏమి చేస్తారో వేచిచూడాలి!
మురిపించి.. విదిల్చారు!
Published Thu, Feb 5 2015 2:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement