
సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ‘‘సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలి. విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలి. రఘురామకృష్ణరాజు మీడియా, సోషల్‌మీడియా ముందుకు రాకూడదు. ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయకూడదు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. మీడియా ముందు కాళ్లు, చేతులు చూపించే విన్యాసాలు చేయొద్దు. రూ.లక్ష పూచీకత్తును ట్రయల్స్ కోర్టులో జమ చేయాలి’’ అని ఆదేశించింది.
కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment