
ఎంపీ కె.రాఘురామకృష్ణంరాజు
పశ్చిమ గోదావరి: నరసాపురం నుంచి సఖినేటిపల్లి వరకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలను కలిపే ‘వశిష్ట వారధి’ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ కె.రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలుగా వశిష్ట వారధి.. గోదావరి జిల్లా వాసుల కలగానే మిగిలిపోయిందన్నారు. అయితే గోదావరి జిల్లా వాసుల చిరకాల కోరికను నిజం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే వశిష్ట వారధి నిర్మాణం కోసం తాజా పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని వెల్లడించారు.ఈ క్రమంలో ఆక్వా సాగు కారణంగా మంచి నీరు కలుషితం జరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. విజ్జేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నేరుగా అన్ని గ్రామాలకు తాగు నీరు ఇస్తూ.. మంచినీటి చెరువులకు గోదావరి జలాలను అందిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment