![Fire Accident In Venugopala Swamy Temple At West Godavari District - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/30/Fire-Accident-1.jpg.webp?itok=wIf-16Ey)
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చలువు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment