sri ramanavami
-
TTD: నేడు శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (మంగళవారం) 67,294 మంది స్వామివారిని దర్శించుకోగా 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.94 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (సిద్ధమైంది. గతేడాదిలానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. కాగా ఏప్రిల్ 17న భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069ను సంప్రదించాలని సూచించారు. భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది… pic.twitter.com/POrpO87fEi — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 1, 2024 -
రూపం ధరించిన ధర్మమే రాముడు
-
రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి
-
సీతారాముల కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు
-
వెండితో సీతమ్మ వారికి సిరిసిల్ల చీర
-
రామతీర్థంలో శ్రీరామ నవమికి పోటెత్తిన భక్తులు
-
శివ ధనుస్సు ఇది రాముని బలం శివ ధనుస్సు ఇది రాముని బలం
-
రామాయణం ఎన్నిరకాలు ? రామాయణం ఎన్నిరకాలు ?
-
సీతారాముల కళ్యాణం లో మాంగల్యధారణ
-
బీహార్‌లో హైటెన్షన్.. ఒకరు మృతి, 80 మంది అరెస్ట్
పాట్నా: శ్రీరామనవమి సందర్భంగా బీహార్‌లో రాజుకున్న ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నలంద జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఓ వ్యక్తి మృతిచెందడంతో పోలీసులు 80 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక, అల్లర్ల కారణంగా బీహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ససారంలో శనివారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడుపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఫొరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంపై ససారం డీఎం ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రోహ్తాస్లోని ఓ గుడిసెలో బాంబు పేలినట్టు తమకు సమాచారం అందిందని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిందని అన్నారు. ఇది మతపరమైన సంఘటనగా కనిపించడం లేదని ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు. Bihar | It has been found that 6 persons were injured during the handling of illegal explosives at a private property in Rohtas; a team of forensic experts is conducting an investigation at the spot. Two persons arrested: Rohtas Police pic.twitter.com/5CLihSFYmh — ANI (@ANI) April 2, 2023 మరోవైపు, నలందాలోని బీహార్‌షరీఫ్‌లో శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పహర్‌పూర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముఖేష్ కుమార్ అనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్తతలు చెలరేగడంతో నలందాలో 80 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇక, ఆదివారం కూడా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే ఈ అల్లర్ల వల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో అమిత్ షా పర్యటన రద్దయ్యింది. #WATCH | Police personnel deployed in Biharsharif, Nalanda as Section 144 is imposed in the city after a fresh clash erupted last night following violence during Ram Navami festivities#Bihar pic.twitter.com/Th9zffoJFt — ANI (@ANI) April 2, 2023 -
AP: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఎగిసిపడుతున్న మంటలు!
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చలువు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Vontimitta: కమనీయం.. సీతారాముల కల్యాణం
సాక్షి, ఒంటిమిట్ట: పండు వెన్నెల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కమనీయంగా, కనులపండువగా జరిగింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం సమీపంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కల్యాణ వేదికలో ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం తిలకించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకించి పులకించారు. సాయంత్రం 5.48 గంటలకు విమానంలో కడప విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్ రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం సీఎం వైఎస్ జగన్ టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రాత్రి 7.35 గంటలకు శ్రీకోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం 8.07 గంటలకు ముఖ్యమంత్రి శ్రీసీతారామస్వామి కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతారాములకు సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ జగదభిరాముడి కల్యాణవేడుక వైభవంగా సాగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం జరిపిస్తున్న పండితులు 9.28 గంటలకు మంగళసూత్రధారణ, 9.30 గంటలకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవం 9.40 గంటల వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. సుదూరం నుంచి కూడా కల్యాణాన్ని వీక్షించేందుకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ అందజేశారు. స్వామి కల్యాణోత్సవంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోదండరాముడికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు శ్రీ కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల నుంచి సుమారు 400 గ్రాముల బరువున్న కిరీటాలు, పట్టువస్త్రాలు కానుకగా పంపారు. మూలమూర్తికి ఒకటి, ఉత్సవమూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టువస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. సీతారాములకు గవర్నర్ దంపతుల పట్టువస్త్రాలు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో వధూవరులు సీతారాములకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు రాజ్‌భవన్ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్‌భవన్ ఉప కార్యదర్శి విశ్వనాథ సన్యాసిరావు శుక్రవారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ అర్చకులకు అందజేశారు. -
నవమి వేడుకల్లో ఘర్షణలు
భువనేశ్వర్/అహ్మదాబాద్/రాంచీ: దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకల సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని లోహర్‌దాగాలో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లా ఖంభట్‌లో జరిగిన గొడవల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో అల్లర్లు చెలరేగాయి. నగరంలో కర్ఫ్యూ విధించి, 80 మందిని అరెస్ట్ చేశారు. రామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరిన దుండగులకు చెందినవిగా గుర్తించిన 50 వరకు అక్రమంగా నిర్మించిన నివాసాలు, దుకాణాల కూల్చివేత ప్రారంభించినట్లు అధికారులు తెలిపా రు. వదంతులకు కారణమైన నలుగురు ప్రభుత్వాధికారులపై చర్యలుంటాయన్నారు. అల్లర్ల సందర్భంగా ఖర్గోన్ పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ చౌధరికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతోపాటు మరో ఆరుగురు పోలీసులు సహా 24 మంది గాయపడ్డారు. దోషులను గుర్తించి వారి ఆస్తులను స్వా ధీనం చేసుకుంటామని సీఎం శివరాజ్ తెలిపారు. జార్ఖండ్‌లోని లోహర్దాగా జిల్లా హిర్హి గ్రామంలో నవమి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు. మసీదుపై కాషాయ జెండా బిహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లా మొహమ్మద్పూర్ ఆదివారం ఒక వ్యక్తి మసీదు ప్రవేశద్వారంపై కా షాయ రంగు జెండా ఎగుర వేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది చూస్తూ కత్తులు, హాకీ స్టిక్కులు పట్టుకుని బైక్‌లపై వచ్చిన వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. విద్వేషం, హింస దేశాన్ని బలహీనపరుస్తాయని, ప్రజలంతా సోదరభావంతో ఐకమత్యంతో మెలగాలని రాహుల్ గాంధీ కోరారు. -
ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
రాములోరి కల్యాణానికి వేళాయె...
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసంత ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేక మహోత్సవం ఆలయం వద్ద ఉన్న మిథిలా స్టేడియంలో జరగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీ స్థాయి లో జరిపేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు బయట కల్యాణోత్స వం జరగనుండటంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. కాగా, కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఒకవేళ సీఎం రాకపోతే ఆయన తరఫున కుటుంబసభ్యులు గానీ.. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గానీ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని సమాచారం. అలాగే, జిల్లా ప్రజల తరఫున తాను స్వామికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. పోచంపల్లి పట్టువస్త్రాలు ప్రత్యేకం రామయ్య కల్యాణానికి ఈ ఏడాది తొలిసారిగా పోచంపల్లి చేనేత కార్మికులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ చైర్మన్ జయరాజు ఆధ్వర్యం లో శనివారం ఈ పట్టు వస్త్రాలను రామాలయ ఈఓ శివాజీకి అందచేయనున్నారు. అలాగే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన భక్త బృందం గోటితో వొలిచిన 3 క్వింటాళ్ల తలంబ్రాలను సమర్పించారు. అంతేకాకుండా సీవీఆర్ వస్త్ర దుకాణం వారు స్వామి వారి ముత్యాల కొనుగోలుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. 11, 12 తేదీల్లో గవర్నర్ పర్యటన పాల్వంచ రూరల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శ్రీరామనవమి మరుసటి రోజు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారికి నిర్వహించే మహా పట్టాభిషేకం కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరవడం ఆనవాయితీ. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో గవర్నర్, 11న భద్రాచలం చేరుకుంటారు. సీతారామచంద్రస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, పట్టాభిషేకంలో పాల్గొంటారు. 12న దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో పర్యటిస్తారు. -
శ్రీరాముని మూల విరాట్టుపై సూర్య కిరణాలు
న్యూఢిల్లీ: సూర్య భగవానుని కిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహంపై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపల్ వెల్లడించారు. ఒడిశా కోణార్క్‌లో సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవిత్ర గర్భగుడిలోకి సూర్య కిరణాలు ప్రసరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ట్రస్ట్ అధికారి ఒకరు చెప్పారు. 2023 డిసెంబర్ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసుకుని, భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని అన్నారు. ఇప్పటికే మొదటి దశ పునాది నిర్మాణం పూర్తయిందనీ, రెండో దశ నవంబర్ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్ 2022 నుంచి మొదలవుతుందన్నారు. -
రామాయణం నీతి నేటికీ ఆదర్శనీయమే
మన దేశంలో రాముడు కోట్లాదిమందికి దేవుడు, రామనామాన్ని ఎందరో మంత్రంగా జపిస్తారు. రామాయణం నిజంగానే జరిగిందని చెప్పే ఆధారాలను చరిత్రకారులు చూపిస్తారు. మన దేశంలోనే కాక ఇంకా కొన్ని దేశాలలో కొంత భిన్నమైన రామాయణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆదికవి వాల్మీకి రామాయణం అన్నింటికి మూలం. రామాయణం ఇంత ప్రాచుర్యం పొందడానికి, రామనామం ఇంత గొప్ప ప్రభావం చూపడానికి కారణాలు ఏమిటి? మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవన విధానాలను, జీవిత విలువలను రామాయణం చెప్తున్నది. అవి ఈనాటికీ అందరికీ ఆదర్శం. అందుచేతనే ఈ నాటికి రామాయణం కథ ఎందరి మీదనో ప్రభావం చూపుతున్నది. రామాయణం మానవజీవితానికి, సమస్త మానవాళికి, సర్వకాలాలకు, సర్వ దేశాలకు ఉపయోగపడే శాశ్వత సత్యాలను, జీవన విధానాలను మనకు చెప్తున్నది. రామాయణాన్ని విమర్శించే వారు ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని కులవివక్షతను చూపుతుందని విమర్శిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో అడుగడుగునా అన్ని వర్గాల వారిని పిలిచి సంప్రదించినట్లు ఉంది. రామ పట్టాభిషేకానికి నాలుగు వర్ణాల వారిని ఆహ్వానించినట్లు ఉంది. అదీగాక రాముడు, గుహుని ఆతి థ్యాన్ని స్వీకరించాడు. మాతంగ మహర్షి (ఒక చండాల స్త్రీ కుమారుడు) ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలోని శబరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ విధంగ రాముడు ఎక్కడ కుల వివక్షతను చూపలేదు. ప్రపంచంలో ఎన్నో రామాయణ కథలు ఉన్నాయి. భిన్నమైన కథలున్నాయి. వాల్మీకి రామాయణంలో ఒకచోట రాముడు జాబాలి వాదనను తిరస్కరిస్తూ ‘బుద్ధుడు దొంగ వంటి వాడు అతడు చెప్పినది నాస్తిక వాదం అని’ అయోధ్య కాండలో రాముడు అన్నట్లు ఉంది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 623 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.పూ. 483లో సమాధి చెందాడు. ఇక రామాయణం ఎప్పుడు జరిగింది? రాముడు క్రీ.పూ. 5114 సంవత్సరంలో జన్మించాడని కొందరు లెక్కలు వేశారు. ఢిల్లీ చాప్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్ వేదాస్ డైరెక్టర్ సరోజ్ బాల రామాయణం, భారతాలు జరిగినవనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని రామాయణ కాలం క్రీ.పూ. 7000 సంవత్సరాలలోపు జరిగిందని అంచనా వేశారు. ఏది ఏమైనా గౌతమబుద్ధుని కంటే కనీసం 1000–700 సంవత్సరాల కంటే ముందే రాముడు ఉన్నాడని చరిత్రకారులు చెప్తున్నారు. రాముడు బుద్ధుని కంటే ముందే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దశావతారాల ప్రకారం కూడా రామావతారం, కృష్ణావతారం తర్వాతనే బుద్ధావతారం అని చెప్తారు. అందుచేత రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అని చెప్పడం కచ్చితంగా జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రామాయణం జరిగిన ఎన్నో వందల సంవత్సరాల తరువాతనే బుద్ధుడు జన్మించాడు అంటే రాముడు బుద్ధుడు దొంగ వంటివాడు అనడం కచ్చితంగా ప్రక్షిప్తమని చెప్పవచ్చు. అలాగే శంబుకుని కథ ప్రక్షిప్తం అని పండితుల, విజ్ఞుల అభిప్రాయం. రామాయణం ప్రకారం రావణాసురుడు బ్రాహ్మణుడు, వేదాలు చదివిన వాడు. గొప్ప శివ భక్తుడు. అతడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని అధికారానికి, సంపదలకు, భార్యలకు కొదవలేదు. కానీ శూర్పణఖ తప్పుడు సలహాతో కామప్రేరితుడై సీతను అపహరించి వినాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మొదట బోయవాడు. రాముడు గుహుని, శబరిల ఆతిథ్యాన్ని స్వీకరించడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, జటాయువుకు దహన సంస్కారాలు చేయడం ఈవిధంగా ఏ కోణంలో చూసినా రామాయణం కులతత్వాన్ని, వర్ణ వివక్షతను సమర్థించదు. ఏ గ్రంథమైనా, ఏ మహానుభావుని చరిత్ర అయినా ఏ పురాణ కథ అయినా అందులోని నీతి ఏమిటి. అది మానవులకు ఇచ్చే సందేశం ఏమిటి? అనే విషయాలను గమనించాలి. అందులోని మంచిని స్వీకరించాలి. రాముడు దేవుడు కాదని ఎవరైనా వాదిం చినా, రామాయణంలోని నీతిని, జీవన విధానాలను తప్పుపట్టలేడు కదా. గురువుల, పెద్దల సలహా పాటించాలి, ఆడిన మాటకు కట్టుబడి ఉండాలి, తండ్రి మాటను గౌరవించాలి, భర్త కష్టాల్లో పాలు పంచుకోవాలి, అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మ మార్గాన్ని అనుసరించాలి. పరస్త్రీలపై కన్ను వేయరాదు. ఇది రామాయణం బోధించిన ప్రధాన జీవన విధానాలు. ఇలాంటి జీవన విధానాలు ప్రపంచ మానవాళికి ఆదర్శం కాదా? జస్టిస్ బి. చంద్రకుమార్ విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 84866 -
పలుకే బంగారమాయెగా
ఉన్నికృష్ణన్– అందరికీ పరిచితమైన పేరు.. ఉత్తర కృష్ణన్– ఈ పేరూ అందరికీ పరిచితమే.. ఇద్దరూ సంగీతంలో అభినివేశం ఉన్నవారే. ఇద్దరూ చలన చిత్రాలలో పాటలు పాడినవారే.శ్రీరామనవమి సందర్భంగా ఈ తండ్రికూతుళ్లు ‘పలుకే బంగారమాయెనా’ అనే రామదాసు కీర్తనను పాడి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. వారం కూడా పూర్తి కాకుండానే ఈ వీడియోను 20 లక్షలకు పైగా విని పరవశించారు. ఈ సందర్భంగా సాక్షి ఫోన్ ద్వారా సంభాషించింది. వివరాలు... మా అమ్మాయి పాడిన భక్తి గీతాలు, సినీ గీతాలు, పాశ్చాత్య సంగీతం వీడియోలకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా రామదాసు కీర్తన పెట్టాలనుకున్నాం. ఎస్. జయకుమార్ అందుకు సహకరించారు. రామదాసు కీర్తనకు ప్రస్తుత పాశ్చాత్య ఆర్కెస్ట్రాను సమకూర్చారు. అంతకుముందే నేను మా అమ్మాయితో కలిసి వీడియో చేద్దామనుకున్నాను. ఇలా తండ్రికూతుళ్లు పాడటం చాలా అరుదు. మా అమ్మాయి ఉత్తరకి ఐదో ఏట నుంచే సుధారాజన్ దగ్గర సంగీతం నేర్పించాను. అమ్మాయి కర్ణాటక సంగీతం, సినిమా పాటలు, పాశ్చాత్య సంగీతం అన్నీ పాడుతోంది. అన్నిటికీ తోడు అమ్మాయి చదువుతున్న స్కూల్లో సంగీతానికి సంబంధించిన విశ్లేషణ, స్వరకల్పన, సంగతులు వేయటం నేర్పిస్తారు. అలా అన్నిచోట్లా సంగీతంతో ప్రయాణం చేస్తోంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా సంగీతాన్ని నేర్చుకుంటోంది. నేను అమ్మాయి కలిసి పాడాలంటే మా ఇద్దరు శృతులు వేరు వేరు. అందువల్ల నేను పాడటానికి వెనకాడాను. అయినా ప్రయత్నిద్దామనుకున్నాను. మాకు ఆడియో పంపేశారు. నేను ఉత్తర బాగా సాధన చేశాం. నాకు తెలుగు రాదు కనుక దోషాలు లేకుండా పాడటం కోసం డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన ‘పలుకే బంగారమాయెనా’ కీర్తనను చాలాసార్లు విన్నాను. ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అమ్మాయి కూడా తప్పులు పాడకుండా శిక్షణ ఇచ్చాను. అలాగే ఆయన బాణీలోనే పాడాం. ఇద్దరం సాధన చేసి, మా కెమెరాలో వీడియో తీశాం. అందులో వచ్చిన దోషాలను మళ్లీ సరిచేసుకున్నాం. అలా ఆ వీడియో తప్పులు లేకుండా రావటం కోసం ఇన్ని శ్రద్ధలు తీసుకున్నాం. మా అమ్మాయితో కలిసి మరిన్ని పాటలు పాడి, వీడియోలు చేయాలని కోరికగా ఉంది. రామదాసుదే ‘సీతా కల్యాణ వైభోగమే’ కీర్తన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శ్రీరామనవమి మాకు నిజంగా పండుగే. రామనామం పానకం వంటిది. ఆ నామాన్ని జపించడం మాకు సంతోషంగా ఉంది.– సంభాషణ: జయంతి -
వందే వాల్మీకి కోకిలమ్
శ్రీరామరామరామేతి రమే రామో మనోరమేసహస్ర నామ తత్తుల్యం రామనామవరాననే..విష్ణుసహస్రనామాలు చదవలేని వారు రామ అనే రెండు అక్షరాలు జపిస్తే చాలని సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతితో అన్నాడు. అంతటి మహిమాన్వితమైన రాముడిని వాల్మీకి ఒక ఆదర్శ మానవుడిగా మనసులో భావించి రామాయణ రచన చేశాడు. ‘ర’ అనే ఒక్క అక్షరాన్ని మాత్రమే రేఫం అంటారు. ర వర్ణానికి శరీర శుద్ధి చేసే లక్షణం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. రాముడు అందరివాడు.. అంతా రామమయం..పాలు మీగడల కన్న పంచదారల కన్న తియ్యనైన నామం..అందరినీ బ్రోచే నామం.. అంటూ రాముడిని ఎవరెవరుఏ విధంగా స్మరించుకున్నారో ఒక్కసారి మనం కూడా వారిని తలచుకుందాం.ఆది కవి వాల్మీకి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షి నేల కూలటం చూసి, మనసు చలించి, రామాయణ కావ్యం రచించాడు. రామాయణం ఆదికావ్యం అయింది. నాటి నుంచి కలం పట్టిన ప్రతి కవీ రామాయణాన్ని వారి వారి భావాలతో అక్షరీకరించారు. రంగనాథ రామాయణాన్ని రచించిన గోన బుద్ధారెడ్డి, రామాయణాన్ని ఆ కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చేశాడు. లక్ష్మణ రేఖ, సీతమ్మవారిని భూమి పెకలించి రావణుడు ఎత్తుకు వెళ్లటం, శబరి ఎంగిలి పండ్లను ఇవ్వటం, రావణుడి కడుపులో అమృతభాండాన్ని సృష్టించటం.. ఇలా ఎన్నో. తరవాత భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, కంబ రామాయణం, తులసీదాసు రామచరిత మానస్... ఇలా అనంతకోటి రామాయణాలు వచ్చాయి. కాళిదాసు ‘రఘువంశ’ కావ్యాన్ని భారతీయులకు అందించాడు. వాల్మీకి రామాయణం తరవాత తెలుగువారు తరవాత ప్రసిద్ధిగా చెప్పుకోదగ్గది విశ్వనాథ రచించిన ‘రామాయణ కల్పవృక్షం’. 30 సంవత్సరాలు ఈ యజ్ఞం సాగింది. రాముడి మీద ఉండే చనువుతో కొద్దిగా స్వేచ్ఛ తీసుకుని, రామాయణ మూల కథ చెడకుండా, మరిన్ని అందాలు సమకూర్చారు, జ్ఞానపీఠాన్ని అందుకున్నారు. రాముడిని తెగనాడినవారూ లేకపోలేదు. ఆ రాముడి ద్వారానే సదరు రచయితలు ప్రసిద్ధి పొందారు. ఇక సినిమా రచయితలు సైతం రాముడు సీతమ్మను అగ్నిపరీక్షకు గురి చేశారంటూ వారి సొంత కలాన్ని ఉపయోగించారు. సీతమ్మ తనకు తాను అగ్ని ప్రవేశం విధించుకుందని వాల్మీకి ఘోషించాడు. పురిపండా అప్పలస్వామి, బేతవోలు రామబ్రహ్మం, పుల్లెల శ్రీరామచంద్రుడు... గణింపలేనంత మంది రామాయణాన్ని రచించారు. ఇదంతా సాహిత్యం.. భాగవతాన్ని రచిస్తూ పోతన..‘పలికెడిది భాగవతమట/పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట/పలికెద వేరొండు గాథ పలుకగనేలా!’అన్నాడు.రామనామంతో కంచర్ల గోపన్న రామదాసు అయ్యాడు. ‘శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభి రామ.......... భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!’ అంటూ వందకు పైగా పద్యాలతో శ్రీరామచంద్రుడిని ఆరాధించుకున్నాడు. వందలకొలదీ శ్రీరామ కీర్తనలు రచించాడు. ‘నను బ్రోవమని చెప్పవే’ అంటూ సీతమ్మను అర్థించాడు. సంకీర్తనలు... త్యాగరాజు తన కృతులతో, కీర్తనలతో రామనామాన్ని గానం చేసి పరవశించిపోయాడు. ‘బ్రోచేవారెవరే రఘుపతే’ అంటూ రాముడి ఔన్నత్యాన్ని చాటాడు. ఒకటా రెండా వందల కొలదీ కీర్తనలు రామనామాన్ని ప్రతిధ్వనించాయి. నీ దయ రాదా రామా.. అని విలపించాడు. త్యాగరాజుతో పాటు ఇతర వాగ్గేయకారులు కూడా రాముని స్తుతించారు. సినిమాలలో... రాముడి సినిమా అనగానే బాపురమణల జంట గుర్తుకు వస్తుంది. రాముడిని అన్నిరకాల కోణాలలో చూపేశారు బాపు. రాముడిని ఎన్నో రకాలుగా తన కలంతో ముద్దాడారు ముళ్లపూడి వెంకట రమణ. సంపూర్ణ రామాయణం, సీతాకల్యాణం, సీతారామవనవాసం, శ్రీరామాంజనేయ యుద్ధం... లాంటి పౌరాణికాలే కాకుండా, సాంఘిక చిత్రాలలోనూ రాముడికి అగ్రస్థానం కల్పించారు. ముత్యాలముగ్గు, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు లాంటి సినిమాలన్నీ రామాయణాన్ని సాంఘికంగా చూపినవే. ఎక్కడ కుదిరితే అక్కడ రాముడిని తెచ్చేస్తారు ఈ జంట. కమ్యూనిస్టుగా పేరుబడ్డ ఆరుద్ర కీర్తించినంతగా రాముడిని మరి ఏ ఇతర సినిమా కవి పొగడలేదేమో. మాధ్యమాల ద్వారా.. శ్రీరామనామం డా. మంగళంపల్లి బాలమురళి గొంతు నుండి అమృతవర్షిణిగా కురిసింది. రామదాసు కీర్తనలను బాలమురళి తన గళం ద్వారా తెలుగు సంగీత ప్రపంచానికి అందచేశారు. విజయవాడ ఆకాశవాణిæ కేంద్రం ద్వారా ఇంటింటినీ అయోధ్యగా మలిచారు ఉషశ్రీ. తన గళంతో వాల్మీకి రామాయణాన్ని ప్రతి ఆదివారం తెలుగు శ్రోతలకు వీనులవిందు చేశారు. దూరదర్శన్‌లో రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచారు రామానందసాగర్. దువ్వూరి వెంకటరమణశాస్త్రి ‘జానకితో జనాంతికం’ అంటూ సీతమ్మతో స్వయంగా మాట్లాడినట్లు చేసిన రచన, ఆయన గొంతులో తెలుగు శ్రోతలను అలరించింది. ప్రస్తుత కరోనా సమయంలో రాములోరి కల్యాణాన్ని అందరం ఇంటి దగ్గరే ఏకాంతంగా చేసుకుందామని పెద్దలందరూ చెబుతున్న విషయాన్ని పాటిద్దాం. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అని ఆ తల్లిని ప్రార్థిద్దాం.– వైజయంతి పురాణపండ -
జయహో రామాయణమ్
వాల్మీకి రామాయణం ఇరవై నాలుగువేల శ్లోకాల గ్రంథం. ఆ మహర్షి ఇందులో కనీసం ఒక్క వాక్యాన్ని కానీ, పదాన్ని కానీ వ్యర్థంగా వాడలేదు. ఎవరి మెప్పుకోసమో రాయలేదు. ధర్మానికి, అధర్మానికి గల వ్యత్యాసాన్ని వర్ణించాడు. కుటుంబ విలువల ఔన్నత్యాన్ని, ఆవశ్యకతను గురించి వివరించాడు. ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే మానవుడైనా, మహనీయుడిగా మన్ననలందుకుంటాడో అనేదానికి ఉదాహరణగా ఆ మర్యాదా పురుషోత్తముడైన రాముని గురించి రమణీయ వర్ణన చేశాడు. అయోధ్యా నగరం గురించి గొప్పగా చెప్పినట్లే, లంకానగర వైభోగం గురించీ అంతే అందంగా చెప్పాడు. కాకపోతే అయోధ్యానగర రాజుల పరిపాలన ఎంత ధర్మబద్ధంగా ఉంటుందో, అక్కడి ఇళ్లు, వాకిళ్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో, ప్రజలు అతి కాముకత్వం, అధర్మం, లోభం, అవిద్య వంటి వాటికి దూరంగా ఎంత సుఖ సంతోషాలతో జీవిస్తారో చెబితే, లంకానగరంలో వీధులు ఎంత సువిశాలమైనవో, సౌధాలు ఏవిధంగా సువర్ణశోభితాలుగా ఉన్నాయో వివరించాడు. అయోధ్యానగర వాసుల ధర్మబద్ధ జీవన విధానం గురించి, లంకానగర వాసుల విచ్చలవిడితనాన్ని గురించీ వర్ణించాడు. ఇక్కడే మనకు వాల్మీకి మహర్షి రచనా చాతుర్యం కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు ఎంత కష్ట పడ్డాడో, ఆ రాముడి మార్గంలో నడవడానికి సీతాలక్ష్మణులు ఎంత ఇష్టపడ్డారో, పుత్ర వియోగాన్ని తాళలేక దశరథుడు ఎలా కుప్పకూలిపోయి మరణించాడో, నాటి ఆచారం ప్రకారం తమ పతిదేవుడితో పాటు సహగమనానికి సిద్ధపడిన కౌసల్యాదేవిని పద్నాలుగేళ్ల అరణ్యవాసానంతరం నీ కుమారుడు రాముడిని రాజుగా చూసుకోవడానికైనా ప్రాణాలతో నిలిచి ఉండాలంటూ మునులు, దేవతలు మంచి మాటలు చెప్పి, ఆమెలో ఆశలు నూరిపోసి ఆమె ప్రయత్నాన్ని నివారించడంలోనే వాల్మీకి అభ్యుదయ భావనలను అర్థం చేసుకోవచ్చు. అడవులకు వెళ్లేటప్పుడు కూడా ఆయుధాలను విడనాడని రామునితో ఆ విషయాన్ని నేరుగా కాకుండా ఆయుధాలను కలిగి ఉండటం వల్ల సాధుజీవులలో సైతం హింసాత్మక భావనలు కలగడాన్ని గురించి కథ రూపంలో సీతమ్మ చెప్పడం, ఆమె మాటలను మెచ్చుకుంటూనే తాను ఆయుధాలను ఎందుకు కలిగి ఉండాలో రాముడు వివరించడం భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహనను తెలియజేస్తుంది. అతిబలవంతుడైన అన్న వాలికి జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న సుగ్రీవుడికి ఆయన సచివుడు, సలహాదారు అయిన హనుమ– కాసేపటిలో చక్రవర్తి కావలసి ఉండీ, పితృవాక్పాలన కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులలో తిరుగుతూ ఉండగా... ప్రాణానికి ప్రాణమైన భార్యను ఎవరు అపహరించారో తెలియక తల్లడిల్లిపోతున్న రామునికీ మైత్రి కుదిర్చి రాముడి కోసం సముద్ర లంఘనం చేసి మరీ సీతాన్వేషణ చేసి, ఆమె క్షేమసమాచారాలను రామునికి చేరవేసిన హనుమ నిస్వార్థం, త్యాగశీలత, సముద్రానికి ఓర్పుతో, నేర్పుతో సమయస్ఫూర్తితో వారధి కట్టి లంకను చేరి, అపారమైన సైన్యసంపదతో, శౌర్యపరాక్రమాలు కలిగిన పుత్ర భ్రాతృ బలగంతో వరబలం గల రాక్షస రావణుడి పదితలలనూ అతి సామాన్యుడైన మానవుడు తెగటార్చాడంటే అందుకు రాముని ధర్మానువర్తనమే కారణం. రామాయణ పఠనమంటే మనలోని దుర్లక్షణాలను దునుమాడటం, మంచి లక్షణాలను, త్యాగబుద్ధిని, సహన శీలతనూ, ధార్మిక, యుక్తాయుక్త వివేచననూ పెంపొందించుకోవడమే. ప్రస్తుతం అందరకూ సెలవులు కాబట్టి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా ఉషశ్రీ, శ్రీరమణ, ఉప్పలూరి కామేశ్వరరావు వంటి వారు సరళంగా రచించిన రామాయణమనే చెరకుగడను నమిలి అందులోని మాధుర్యాన్ని మనం అనుభవించి, మన వారసులకు ఆ తీపిని చవిచూపించేందుకు ప్రయత్నిద్దాం. ప్రతి సంవత్సరం భద్రాద్రిలోనూ, దేశమంతటా అంగరంగవైభవంగా శ్రీరామ నవమి సంబరాలు, సీతారామ కల్యాణ ఉత్సవాలు జరిపించడం ఆనవాయితీ. లక్షలాది మంది స్వయంగా వీక్షించి తరించేవారు. దురదృష్టవశాత్తూ ఈ సంవత్సరం అటువంటి అవకాశం లేనప్పటికీ, అర్చకులు కల్యాణ క్రతువును నిర్వహించడంలో లోటేమీ ఉండదు కాకపోతే మన మనో నేత్రాలతో బుల్లితెరల ముందు కూర్చుని ఆ వేడుకలను స్వయంగా తిలకించడంతో సరిపెట్టుకుందాం. ఈ క్లిష్ట పరిస్థితులలో పండుగ ఎలా జరుపుకోవాలి? పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి, ఇంట్లో సీతారాముల వారిని భక్తి, శ్రద్ధలతో పూజించచడం, వడపప్పు, పానకం, పాయసంలాంటి పదార్ధాలను నివేదించిశ్రీరామ నామం స్మరిస్తూ ఉండడం, శక్తి కొలది దాన ధర్మాలు చేయడం. – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీరామనవమికి హెలికాప్టర్ సర్వీసులు!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి దివ్యక్షేత్రానికి జాతీయ స్థాయిలో మంచి ప్రఖ్యాతి ఉంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి, మరుసటి రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం, దానికి ముందురోజు నిర్వహించే తెప్పోత్సవం కార్యక్రమాలకు సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శ్రీరామనవవిుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. గోదావరిపై వంతెన లేని కాలంలో కూడా భారీగానే వచ్చేవారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గోటి తలంబ్రాలతో వందల కిలోమీటర్ల మేర కాలినడకన వస్తున్నారు. అయితే సీతారామ కల్యాణానికి ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు సైతం ప్రతి సంవత్సరం వస్తుంటారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి మరింత ప్రాచుర్యం, ప్రాధాన్యత కల్పించేలా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం.. పర్యాటక శాఖ ద్వారా మూడు రోజుల పాటు హెలికాప్టర్లు నడిపితే ప్రముఖ వ్యక్తులు కల్యాణానికి వచ్చేందుకు మరింత ఆసక్తి చూపిస్తారని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీసులు నడిపారు. విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు, తెలంగాణ భక్తులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. గత శివరాత్రి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి సైతం హైదరాబాద్ నుంచి మూడు రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులు నడిపారు. ఈ రెండు చోట్లా జౌత్సాహిక భక్తుల కోసం విహంగ వీక్షణం అవకాశాన్ని సైతం పర్యాటక శాఖ కల్పించింది. శ్రీరామనవమి, తెల్లవారి పట్టాభిషేకం సందర్భంగా భద్రాచలానికి కూడా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, విహంగ వీక్షణం అవకాశాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా పర్యాటక శాఖకు ఆదాయం సమకూరడంతో పాటు భద్రాద్రికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల ఆలయానికి సైతం హెలికాప్టర్ సర్వీసులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన భక్తులు సందర్శిస్తారని చెబుతున్నారు. భద్రాచలం, పర్ణశాల ఆలయాలు రెండూ గోదావరి ఒడ్డునే ఉన్నాయి. ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఖండాంతరాలు దాటి అనేక దేశాలకు భక్తులు నిష్టతో తీసుకెళుతున్నారు. ఇలాంటి ప్రాశస్త్యం ఉన్న భద్రాచలం ఉత్సవాలకు హెలికాప్టర్ సర్వీసులను ఏర్పాటు చేయాలని, ఈ విషయమై మంత్రి అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనన్న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రామమందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుండగా.. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా లాంఛనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయవచ్చునని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూవివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి బాలరాముడి (రామ్ లల్లా విరాజమాన్)కి చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ.. రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది. రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్‌పీ(ఐవీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్‌కుమార్ వెల్లడించారు. -
పాతబస్తీలో ప్రారంభమైన శోభాయాత్ర!
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా సీతారామ్ బాగ్, రాణి అవంతీబాయ్ ఆలయం నుంచి శ్రీ సీతారాముల శోభయాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. గౌలిగూడలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనున్న ఈ శోభయాత్రలో శ్రీరామ ఉత్సవ సమితి, భజరంగ్‌దళ్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పురాన్‌పూల్, గౌలీగూడ, సుల్తాన్ బజార్ మీదుగా సాగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. సుమారు ఐదువేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలను సైతం మూసివేయించారు. శోభాయాత్రలో సుమారు లక్షన్నర మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూంలను ఏర్పాటును చేశారు. అదనపు కమిషనర్ షిఖా గోయల్ ఆధ్వర్యంలో అదనపు డీసీపీలు-3, డీఎస్పీలు-4, ఇన్స్పెక్టర్లు-28, ఎస్సైలు-38, హెడ్‌కానిస్టేబుళ్లు-46, కానిస్టేబుళ్లు-86, అదనపు బలగాలు ప్లాటూన్-13, టీయర్‌గ్యాస్ స్క్వాడ్స్-2 బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు. యాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. -
హిందుస్థాన్ జిందాబాద్.. దిల్‌కీ అవాజ్..
జియాగూడ: హిందుస్థాన్ జిందాబాద్.. దిల్‌కీ అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్.. అవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే, శ్రీరామ్ యువసేన భాగ్యనగర్ అధ్యక్షుడు టి.రాజాసింగ్ లోథా అన్నారు. ప్రతి యేటా శ్రీరామనవమి శోభాయాత్రలో తనే స్వయంగా రచించిన ఒక పాటను పాడడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈసారి శ్రీరామనవమి శోభాయాత్రలో హిందుస్థాన్ జిందాబాద్.. దిల్కే అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్ పాటను పాడడం జరిగిందన్నారు. ఈ పాటను సైనికులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మూడు దేశభక్తి పాటలు ఐదు శ్రీరాముడిపై రచించానని వెల్లడించారు. శోభాయాత్ర రోజున ఈ పాటను ప్రజల సమక్షంలో కూడా పాడి వినిపిస్తానని రాజాసింగ్ తెలిపారు. పాటల సీడీలను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.