Live Updates..
కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..
గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
- కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది
- ఇది ప్రజల సముద్రం
- మే 13వ తేదీన జరగబోతున్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడిన ప్రజల సముద్రం ఇది
- ఈ సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న దమ్ములకు, నా అవ్వా-తాతలకు, ప్రతీ ఒక్కరికీ మీ బిడ్డ హృదయ పూర్వకంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
- సమర శంఖం పూరిద్దామా.. ప్రజల సంక్షేమం కోసం, పేదల భవిష్యత్ కోసం, పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగించేందుకు, ప్రతీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, పెత్తందార్లపై యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?
- ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్.
- చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున..
- ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు
- కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద.
- మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు.
- అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు
- కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.
- చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు
- జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు
- ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు
- పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము
- ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు
- మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు
- నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం.
- నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.
- మీ జగన్‌పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది
- రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే
- కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే
- ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే
- గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
- తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
- విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే
- చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే.
- విప్లవాత్మక మార్పులు మీ బిడ్డ పాలనలో జరిగాయి
- జన్మభూమి కమిటీలతో చంద్రబాబు గ్రామాలను దోచేశాడు
- పెట్టుబడి సాయంగా రైతన్నకు రైతు భరోసా ఇస్తున్నాం
- ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చింది మీ జగన్.. మీ బిడ్డ
- పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
- విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా ఉంటున్నాం
- 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం
- మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది
- 58 నెలల్లోనే మీ బిడ్డ సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొచ్చాడు
- ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్క్ కనిపిస్తోంది
- రూ. 3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదే
- గ్రామ సచివాలయాల ద్వారా 600పైగా సేవలు
- రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయంటే మీ జగన్.
- 10 ఫిషింగ్ హార్బర్‌లు వస్తున్నాయంటే మీ జగన్
- 10 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు అంటే మీ జగన్
- ఎయిర్‌పోర్ట్ విస్తరణ అంటే మీ జగన్
- కొత్త భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు వాయువేగంతో జరుగుతున్నాయంటే మీ జగన్
- మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు, 10 ఇండస్ట్రీయల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్
- ప్రణాళిక బద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయంటే మీ జగన్
- వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా వస్తున్నామంటే మీ జగన్
- మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 99శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది
- కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతోంది. మరి వారి జెండా నలుగురితో జత కట్టినా ఎగరలేక కింద పడుతోంది
- మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా.. వద్దా?
- మరి ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా.. వద్దా..
- అందుకే మళ్లీ చెబుతున్నా.. ఈ ఎన్నికల్లో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. రాబోయే ఐదేళ్లలో మీ భవిష్యత్‌ను నిర్ణయించేవే ఈ ఎన్నికలు.
- ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయనే ఆలోచన చేయండి
- అలా ఆలోచన చేసి ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుందనే విషయం గుర్తు పెట్టుకోండి
- చంద్రబాబు కూటమి చరిత్రను కూడా ప్రతీ ఇంటికి వెళ్లి వివరించండి
- 2014లో చంద్రబాబు అండ్ కో కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేసిన వైనాన్ని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి
మనందరి నమ్మకం సీఎం జగన్: కొడాలి నాని
- సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది
- వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు
- పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్
- ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు
- చంద్రబాబుది మాయా కూటమి
- సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడు
- దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయి
గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్
- ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్
- జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం
కాసేపట్లో గుడివాడలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ
- మేమంతా సిద్ధం సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
- మేమంతా సిద్ధం అంటూ నినదిస్తున్న అభిమాన తరంగం
- గుడివాడ మేమంతా సిద్ధం సభలో జనప్రభంజనం
- జై జగన్ నినాదాలతో హోరెత్తుతున్న సభా ప్రాంగణం
- మేమంతా సిద్ధం సభలో ప్రసంగించనున్న సీఎం జగన్
కృష్ణాజిల్లా:
గుడివాడలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం సభ
- బహిరంగ సభకు అవనిగడ్డ నుంచి వేలాదిగా తరలి వెళ్లిన కార్యకర్తలు అభిమానులు
- జెండా ఊపి బస్సులను ప్రారంభించిన అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ
గుడివాడ నియోజకవర్గం పుట్టగుంటలో సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలు
- మరి కాసేపట్లో జొన్నపాడు వద్ద భోజనం విరామం
హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలుకుతున్న ప్రజానికం
ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్
- పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్
- మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది.
- ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను.
- ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు.
- ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం.
- ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
►తేలప్రోలుకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
►అడుగడుగునా హారతులు, పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు
►ఆత్కూరు దాటి ముందుకు సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర..
►గన్నవరం జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర.
►ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం రహదారులు
►సీఎం జగన్‌కి దారిపొడవునా గన్నవరం ప్రజల అపూర్వ స్వాగతం
గన్నవరంలోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర
- సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న గన్నవరంవాసులు
- జనసంద్రమైన గన్నవరం.
- టీడీపీ కుట్రలకు ఓటుతోనే బుద్ధి చెబుతామంటున్న గన్నవరంవాసులు
జనం సమస్యలు వింటూ..
- దాడి తర్వాత తొలిసారి ప్రజల్లోకి సీఎం జగన్
- కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన కాసేపటికే.. 100 మీటర్ల పరిధిలో రెండుసార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన సీఎం జగన్
- బయటకు వచ్చి ప్రజల సమస్యలు వింటున్న సీఎం జగన్
ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర
- కృష్ణా జిల్లాలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- కేసరపల్లి నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర
- దాడి ఘటనలో గాయపడిన సీఎం జగన్.. విశ్రాంతి తీసుకుని ఒక్కరోజు విరామంతో యాత్ర చేపట్టిన సీఎం జగన్
- నిఘా నీడలో కొనసాగనున్న యాత్ర
- సీఎం జగన్ పర్యటించే ప్రాంతాల్లో నిశితంగా పరిశీలించనున్న అధికారులు
- పూలు జల్లడం, క్రేన్‌లతో గజమాలలపై ఆంక్షలు విధించిన అధికారులు
- సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభ
- జనసంద్రంగా మారిన గన్నవరం
- ఉక్కు సంకల్పంతో ముందుకు సాగనున్న యాత్ర
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు
- కేసరపల్లి క్యాంప్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు దేవినేని గౌతమ్, దేవినేని స్మిత, కాంగ్రెస్ నేత.. ఉక్కు కాకాని రామ్మోహన్ రావు మనవడు కాకాని విజయ్ కుమార్
- సీఎం జగన్ సమక్షంలో వైస్సార్సీపీలో చేరిక
►జన సంక్షేమ సారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు గన్నవరంకు భారీగా చేరుకుంటున్న జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు.
మరికాసేపట్లో కేసరపల్లి నుంచి ప్రారంభంకానున్న బస్సు యాత్ర
► వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
కృష్ణా జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2024
► బస్సు యాత్రలో భాగంగా గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు.
Memantha Siddham Yatra, Day -15.
— YSR Congress Party (@YSRCParty) April 15, 2024
ఉదయం 9 గంటలకు కేసరపల్లి దగ్గర నుంచి ప్రారంభం
సాయంత్రం 4.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ
ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/4V7r6jxFey
► గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment