Live Updates..
వినుకొండలో జన ప్రవాహం
- వినుకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం
- జనసంద్రంగా మారిన వినుకొండ
- దారిపొడవునా భారీ గజమాలతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన ప్రజలు
- మేమంతా సిద్ధమంటూ... ముఖ్యమంత్రి బస్సుతో పాటు కదిలిన జన ప్రవాహం
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దారిపొడవునా సంఘీభావం తెలిపిన విద్యార్దులు, యువతీ యువకులు, చిన్నారులతో సహా తల్లులు, అవ్వాతాతలు.
- సుమారు రెండు గంటలకు పైగా వినుకొండలో కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్ర
- పొద్దు గడుస్తున్నా తగ్గని ఉత్సాహం... వినుకొండలో బారులు తీరిన జనం
అశేష జనవాహిని మధ్య కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంతగా జనం
- సీఎ జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు
వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం
- పల్నాడు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- వినుకొండలో సీఎం జగన్‌కు ప్రజల బ్రహ్మరథం
- సీఎం జగన్‌కు అడుగడుగునా జననీరాజనాలు
- దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం
వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర
- వినుకొండ అడ్డరోడ్డు వద్ద సీఎం జగన్ భోజన విరామం
- ఇక్కడ నుంచి సాయంత్రం ఐదు గంటలకి వినుకొండలో సీఎం జగన్ బస్సుయాత్ర
►చింతలచెరువు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర.
►ఘన స్వాగతం పలికిన చింతల చెరువు ప్రజలు
►కురిచేడు గ్రామంలో సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం
►ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ బస్సుయాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు
►సీఎం.. సీఎం నినాదాలతో దద్దరిల్లిన కురిచేడు గ్రామం
►అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకే..
పెన్షన్ కోసం అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాడు. ప్రతి నెలా ఒకటో తారీఖున అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు పెన్షన్ను మీ బిడ్డ… pic.twitter.com/gjQ6WqWIQS
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024
►వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖిలో సీఎం జగన్ మాట్లాడుతూ..
- కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నా
- అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా
- గత ప్రభుత్వంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేది
- గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందకి మాత్రమే పెన్షన్ వచ్చేది
- ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి
- అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక
- అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం ఆలోచన చేశాను
- దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకోచ్చాం
- వాలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్ పంపించాం
- 56 నెలలుగా మన ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్ అందించాం
- గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం
- అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాం
- కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ అందించాం
- ఇవాళ 66 లక్షల మందికి పైగాపెన్షన్ అందిస్తున్నాం
- ఇవాళ రూ.3 వేల వరకూ పెన్షన్ పెంచుకుంటూ వచ్చాం
- అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే మనసులో ప్రేమ ఉండాలి
- 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు.
- ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా?
- రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి
- విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయి
- వీటిని మార్చేందుకు మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు
- ఎన్నికల ముందు మేనిఫెస్టో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు
- ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేశారు.
- మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం రాదు.. మోసాలు చేయలేడు
- చంద్రబాబు, వారి కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను
- మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడంతే
- జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే
- రూ.3 వేల ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు
- నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాం
- 58 నెలలుగా పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశాం
- చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు
- చేయగలిగేదే చెప్పాలి.. చేయలేనిది నేను చెప్పకూడదు
- పేదలకు మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీపడే వారు దేశంలోనే లేరు
- 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశారు
- మోసం చేసేవారిని నమ్మొద్దని కోరుతున్నా
- చంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోతున్నాయి
- అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారు
- చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టే
లబ్దిదారులు మాట్లాడుతూ...
- వాలంటీర్లు మొన్నటి వరకూ పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇచ్చేవారు
- చంద్రబాబు చేసిన పనితో ఈ నెల పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డాం
- మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేలు జరుగుతుంది
- చంద్రబాబు మాపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు
- పెన్షన్ అందకుండా చేసి ఆయన ఏం సాధిస్తాడు
- వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది
- గతంలో చంద్రబాబు మనుషులకే పెన్షన్ వచ్చేవారు
- జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్ వచ్చేది
- జగన్ పాలనలోనే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ వచ్చింది
► ప్రకాశం జిల్లాలో పదకొండోరోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది.
►పదకొండో రోజు పల్నాడు జిల్లా సిద్ధమా?
Day-11 పల్నాడు జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2024
► వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 11వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది.
► ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం జగన్ బయలుదేరుతారు.
► ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బసకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment